మహేశ్వరం, జూలై 10: బీఆర్ఎస్తోనే తెలంగాణకు ఉజ్వల భవిష్యత్తు ఉన్నదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం మహేశ్వరం మండలం గట్టుపల్లి గ్రామానికి చెందిన 50 మంది బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు గ్రామ సర్పంచ్ అనితా ప్రభాకర్‌రెడ్డి, ఉపసర్పంచ్ మేకల శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి వారికి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాలనలో మహేశ్వరం నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదన్నారు. రానున్న ఎన్నికల్లో మహేశ్వరంలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని చెప్పారు. సీఎం కేసీఆర్‌తోనే తెలంగాణకు శ్రీరామరక్ష అని అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో బీజేపీ యువమోర్చా మాజీ అధ్యక్షుడు ఏసుగొంగ రాందాసు, ఐల రాజేందర్, మేకల రాజు, మంగలి జనార్దన్, జెనిగ సురేశ్, కావలి నరేశ్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షుడు ఎర్ర శంకరయ్య, వార్డు సభ్యుడు విష్ణువర్ధన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మహ్మద్ సాదాద్ తదితరులు పాల్గొన్నారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో..
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయని, ఇదే స్ఫూర్తితో రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ సాధించడం ఖాయమని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం సూరారం 129 డివిజన్ నెహ్రూనగర్‌కు చెందిన తెలంగాణ భవన నిర్మాణ కార్మిక యూనియన్, శ్రీచైతన్య సాగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు చింతల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేకానంద్ మాట్లాడుతూ.. పార్టీలో చేరే ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా డివిజన్ల అధ్యక్షులు పుప్పాల భాస్కర్, పోలే శ్రీకాంత్, నాయకులు మారయ్య, సిద్దిఖ్, ఫిరోజ్, గండయ్య, దశరథ్, అఖిల్, కిరణ్‌సాగర్, విఠల్, అలీ, కృష్ణతో పాటు తదితరులు పాల్గొన్నారు.
తార్నాక డివిజన్లో..
రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరుతున్నారని బీఆర్ఎస్ కార్మిక విభాగం అధ్యక్షుడు మోతె శోభన్‌రెడ్డి అన్నారు. తార్నాక డివిజన్లోని తన నివాసంలో టీటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవానంద్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరిన వారికి శోభన్‌రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మోతె శోభన్‌రెడ్డి మాట్లాడుతూ… రాష్ట్రంలో ఎనిమిదేళ్లుగా కొనసాగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి వలసలు కొనసాగుతున్నాయని చెప్పారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి, పార్టీ మరింత బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముడుగుల వంశీకృష్ణారెడ్డి, లక్ష్మీనరసింహారెడ్డి, మల్లేశ్, కనకరాజు, వెంకటేశ్, రాజేశ్, బన్నీ, ప్రశాంత్, నరసింహ, ఫణికుమార్, పవన్, అక్కి తదితరులు పాల్గొన్నారు.