డ్రంకెన్ డ్రైవ్‌లో 400 మందికి జైలు
నగర ట్రాఫిక్ పోలీసులు జూన్‌లో 2818 డ్రంక్ అండ్ డ్రైవ్(డీడీ) కేసులు నమోదు చేశారని ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్‌బాబు వెల్లడించారు. ఇందులో న్యాయస్థానం 400 మందికి(ఒక రోజు నుంచి 7 రోజుల వరకు) జైలు శిక్ష, జరిమానాలు, మిగతా వారికి జరిమానాలు విధించిందని, 44 డ్రైవింగ్ లైసెన్స్‌లను సస్పెండ్ చేసిందని తెలిపారు.
- జూన్ నెలలో 2818 డీడీ కేసులు
- డ్రైవింగ్ చేసిన 195 మంది మైనర్లకు శిక్ష
- 44 మంది డ్రైవింగ్ లైసెన్స్‌లు సస్పెన్షన్
సిటీబ్యూరో, జూలై 8 (నమస్తే తెలంగాణ): నగర ట్రాఫిక్ పోలీసులు జూన్‌లో 2818 డ్రంక్ అండ్ డ్రైవ్(డీడీ) కేసులు నమోదు చేశారని ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్‌బాబు వెల్లడించారు. ఇందులో న్యాయస్థానం 400 మందికి(ఒక రోజు నుంచి 7 రోజుల వరకు) జైలు శిక్ష, జరిమానాలు, మిగతా వారికి జరిమానాలు విధించిందని, 44 డ్రైవింగ్ లైసెన్స్‌లను సస్పెండ్ చేసిందని తెలిపారు. వివిధ ఉల్లంఘనలకు సంబంధించి 4321 ఛార్జీషీట్లు గత నెలలో కోర్టుకు సమర్పించినట్లు ఆయన పేర్కొన్నారు. ఇందులో మైనర్ డ్రైవింగ్‌కు పాల్పడ్డ వారిపై నమోదు చేసిన కేసుల్లో 195 మందికి న్యాయస్థానం సోషల్ సర్వీస్, కమ్యూనిటీ సర్వీస్ చేయాలని శిక్షలు విధించిందని వివరించారు.
డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి, నంబర్ ప్లేట్ లేని వారు, అర్హత లేని వారు, నిబంధనలను పాటించని వాహన యజమానులకు ఆయా ఉల్లంఘనలపై న్యాయస్థానం జరిమానాలు విధించిందన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ఇతర ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడేవారికి న్యాయస్థానం శిక్షలు విధించడం వల్ల అది భవిష్యత్తుపై మరకలా ఉంటుందని, ప్రభుత్వ ఉద్యోగాలు, పాస్‌పోర్టు, వీసాలు రావడంలో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని అదనపు సీపీ సూచించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

