Hyderabad | నగరంలో ఎండలు క్రమంగా పెరుగుతున్నాయి. మార్చి నెల మొదటివారంలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. 40కి చేరువలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందని, అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నది. ఆదివారం సిటీలో మధ్యాహ్నం వేళ..జనసంచారం లేక బోసిపోయిన రోడ్డును చిత్రంలో చూడొచ్చు.