సిటీబ్యూరో, మే 31 (నమస్తే తెలంగాణ): నగరంలోని పలుచోట్ల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎస్టీఎఫ్ పోలీసులు దాడులు జరిపారు. ఈ దాడుల్లో రూ.4.36లక్షల విలువ చేసే 122 ఎల్ఎస్డీ బ్లాస్ట్‌లు, 16 గ్రాముల ఓజీ కుష్, 4.69గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ను పట్టుకుని, నిందితులను అరెస్టు చేశారు. ఎస్టీఎఫ్ ఈఎస్ అంజిరెడ్డి కథనం ప్రకారం..ఢిల్లీలోని ఐఐఐటీలో ఉన్నత చదువులు చదువుతున్న కనిష్ కెవిన్ అనే యువకుడు డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడు.
ఈ క్రమంలో మత్తులో కూరుకుపోయిన సదరు విద్యార్థి పరీక్షల్లో ఫెయిల్ కావడంతో హైదరాబాద్‌కు వచ్చి హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో చేరాడు. అయితే ఢిల్లీలో ఉన్న పరిచయాలతో అక్కడి నుంచి ఎల్ఎస్డీ బ్లాస్ట్‌లు కొనుగోలుచేసి నగరంలో విక్రయించడంతోపాటు తాను తీసుకునేవాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న ఎస్టీఎఫ్ పోలీసులు డీడీనగర్లో డ్రగ్స్ విక్రయాలకు పాల్పడుతున్న కనిష్క్ కెవిన్‌ను అరెస్ట్ చేసి, అతడి వద్ద నుంచి 113ఎల్ఎస్డీ బ్లాస్ట్‌లు, 16గ్రాముల ఓజీ కుష్‌ను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ఎం.దీపక్‌కుమార్, మహ్మమద్ సిరాజ్ , జెతిన్లపై కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు.