జోరుగా అక్రమ మద్యం విక్రయాలు
డ్రై డే (నిషేధిత రోజు) రోజున అక్రమంగా మద్యం అమ్మకాలు జరిపిన 12 బెల్టు షాపులపై సైబరాబాద్ ఎస్ఓటీ అధికారులు దాడులు జరిపారు. ఈ దాడుల్లో 12 మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.4.03లక్షల విలువజేసే 365 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు.
- సైబరాబాద్‌లో రూ.4.03 లక్షల మద్యం పట్టివేత
సిటీబ్యూరో, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): డ్రై డే (నిషేధిత రోజు) రోజున అక్రమంగా మద్యం అమ్మకాలు జరిపిన 12 బెల్టు షాపులపై సైబరాబాద్ ఎస్ఓటీ అధికారులు దాడులు జరిపారు. ఈ దాడుల్లో 12 మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.4.03లక్షల విలువజేసే 365 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. శ్రీరామ నవమిని పురస్కరించుకుని ఈ నెల 17న మూడు కమిషనరేట్ల పరిధిలో మద్యం అమ్మకాలు చేపట్టవద్దంటూ ఆంక్షలు విధించారు. దీనిని ఆసరాగా చేసుకొని..
దుండిగల్, అల్వాల్, సురారం, మేడ్చల్, బాచుపల్లి, ఆర్సీ పురం, చందానగర్, గచ్చిబౌలి, మియాపూర్, అత్తాపూర్, మైలార్‌దేవ్‌పల్లి, నార్సింగి పోలీసు స్టేషన్ల పరిధిలో మద్యం మాఫియాలు అక్రమంగా బెల్టు షాపుల ద్వారా పెద్ద ఎత్తున మద్యం విక్రయాలకు పాల్పడ్డారు. ఈ మేరకు సమాచారం అందుకున్న సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసు బృందాలు రంగంలోకి దిగి, ఆయా ఠాణాల పరిధిలో పెద్ద ఎత్తున దాడులు జరిపారు. ఈ దాడుల్లో 12 పోలీసు స్టేషన్ల పరిధిలో 12 అక్రమ మద్యం కేంద్రాలను నిర్వహిస్తున్న 12 మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.4,03,806ల విలువజేసే 365 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం కేసులను సంబంధిత ఠాణాలకు అప్పగించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Water Crisis | నీటి సంక్షోభం.. నీరు వృథా చేస్తే నాగ్‌పూర్‌లో రూ.5,000 ఫైన్.. పూనేలో వారానికోసారి నీళ్లు బంద్
‘పట్టభద్రులు ఓటు నమోదు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి’
Swadeshi Jagaran Manch: స్టార్‌లింక్‌ను బ్యాన్ చేయండి.. స్వదేశీ జాగరణ్ మంచ్ డిమాండ్
చివరి మజిలీ కోసం తీవ్ర ఇబ్బందులు
Koffee with Karan | నువ్వు ఇంకా వర్జిన్‌గానే ఉన్నావా?.. సల్మాన్‌ను మళ్లీ అదే ప్రశ్న అడిగిన కరణ్ జోహార్!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

