బడంగ్‌పేట, మే 28: హైదరాబాద్ శివారు మహేశ్వరం మండలం డీజీ తాండలో రైతు డాక్య నాయక్‌కి చెందిన 36 గొర్రెలు వీధి కుక్కల దాడిలో మృత్యువాత పడ్డాయి. 20కి పైగా గొర్రెలు గాయపడ్డాయి.
మంగళవారం రాత్రి పడుకున్న తర్వాత వీధికుక్కలు మూకుమ్మడిగా గొర్రెల మందిపై దాడి చేశాయని రైతు డాక్యా నాయక్ తెలిపారు. దీనివల్ల రూ.4లక్షల వరకు నష్టం జరిగిందని పేర్కొన్నారు. వీధికుక్కల దాడిలో గొర్రెలు చనిపోవడంతో ఆ కుటుంబం కన్నీటి పర్యంతమైంది. ఉదయం లేచి తాము చూసే సరికి గొర్రెలు మృత్యువాత పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీధి కుక్కలను పట్టించుకోకపోవడం వల్లనే మాకు తీవ్ర నష్టం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆ గొర్రెలపైనే ఆధారపడి జీవించేవారమని చెప్పుకొచ్చారు.