హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలోని మణికొండలో (Manikonda) పెను ప్రమాదం తప్పింది. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మణికొండలోని పుప్పాలగూడలో 35 అడుగుల పొడవున్న ఓ గోడ కూలిపోయింది. దీంతో మూడు ఇండ్లు మట్టిదిబ్బల్లో కొట్టుకుపోయాయి. అయితే ఆ సమయంలో ఇండ్లలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. 2008లో శివాలయానికి రక్షణగా ఈ గోడను ఆలయ కమిటీ నిర్మించింది. అయితే రాత్రి కుండపోతగా వర్షం కురవడంతో అది కూలిపోయింది.
ఆకాశానికి చిల్లులు పడినట్లుగా హైదరాబాద్‌లో (Hyderabad) వర్షం దంచికొట్టింది. కుండపోతగా కురిసిన వానతో రోడ్లపై ఎక్కడచూసినా నీరు నిలిచిపోయింది. నగరంలో అత్యధికంగా కుత్బుల్లాపూర్‌లో అత్యధికంగా 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. ఇక శేరిలింగంపల్లిలో 14 సెం.మీ., సరూర్‌నగర్‌లో 12.8 సెం.మీ., ఖైరతాబాద్‌లో 12.6 సెం.మీ. చొప్పున వర్షంపాతం నమోదయింది. ఈ నేపథ్యంలో అధికారులను జీహెచ్ఎంసీ పరిధిలోని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తం చేశారు. అధికారులంతా అందుబాటులో ఉండాలని, సమన్వయం పనిచేయాలని ఆదేశించారు. ఆయా కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. వరద సహాయక చర్యల కోసం నంబర్లను కేటాయించారు.
హైదరాబాద్- 040 230 2813/74166 87878
ఎన్డీఆర్ఎఫ్- 83330 68536
కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ)- 87125 96106
హైడ్రా- 91541 70992
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు- 87126 60600
సైబరాబాద్ కమిషరేట్- 85004 11111
రాచకొండ కమిషనరేట్- 87126 62999
టీజీఎస్పీడీసీఎల్- 79015 30966
జీహెచ్ఎంసీ- 81259 71221
జలమండలి- 99499 30003