సిటీబ్యూరో, మార్చి 11 (నమస్తే తెలంగాణ) : బల్దియా ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో దరఖాస్తులు వెల్లువెత్తాయి. వివిధ సమస్యలపై ప్రజలు అధికారులకు అర్జీలు అందించగా, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు పంపించారు. జీహెచ్ఎంసీ వ్యాప్తంగా మొత్తం 334 దరఖాస్తులు వచ్చాయని, ప్రధాన కార్యాలయంలో 257 వస్తే.. జోనల్లో మొత్తం 77 అర్జీలు వచినట్లు అధికారులు వెల్లడించారు. చార్మినార్‌లో 1, సికింద్రాబాద్‌లో 5, కూకట్‌పల్లిలో 42, శేరిలింగంపల్లిలో 17, ఖైరతాబాద్‌లో 5, ఎల్బీనగర్లో 7 దరఖాస్తులు వచ్చాయన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో ఈఎన్సీ జియావుద్దీన్, అడిషనల్ కమిషనర్లు నళిని పద్మావతి, గీతా మాధురి, సత్యనారాయణ, యాదగిరిరావు, జయరాజ్ కెన్నడి, సీసీపీ రాజేంద్రప్రసాద్ నాయక్, చీఫ్ మెడికల్ అధికారి డాక్టర్ పద్మజ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే ప్రజావాణిలో కమిషనర్ రోనాల్డ్ రాస్ పాల్గొనకపోవడంపై దరఖాస్తుదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.