హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలో భారీగా గంజాయి (Ganja) పట్టుబడింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ పరిధిలో మహేశ్వరం ఎస్వోటీ, స్థానిక పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఓ కంటైనర్లో 300 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కంటైనర్ను సీజ్ చేశారు. గంజాయిని విశాఖపట్నం నుంచి హైదరాబాద్కు తరలిస్తున్నారని పోలీసులు వెల్లడించారు.
స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.కోటి ఉంటుందని తెలిపారు. ముందస్తు సమాచారంతో తనిఖీలు చేపట్టినట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించి మధ్యాహ్నం 3 గంటలకు మీడియా సమావేశంలో పూర్తి వివరాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు.