హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలోని హయత్‌నగర్ కొహెడలో (Koheda) దొంగలు బీభత్సం సృష్టించారు. గొర్రెల మంద వద్ద కావలిగా ఉన్నవారిపై దాడిచేసి 30 గొర్లను ఎత్తుకెళ్లారు. నవీన్ అనే వ్యక్తి కుషాయిగూడల పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అతని తండ్రికి గొర్రెల మంద ఉన్నది. తండ్రికి అనారోగ్యం కారణంగా ఆదివారం రాత్రి నవీన్‌తోపాటు మరో వ్యక్తి మందకాడికి కావలిగా వెళ్లారు. అర్ధరాత్రి దాటిన తర్వాత నిద్రిస్తున్న వారిపై కత్తులతో దాడిచేసిన దుండగులు.. గొర్రెలను అపహరించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన నవీన్‌ను దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.