మహేష్ బ్యాంక్ హ్యాకింగ్ కేసు.. ముగ్గురు అరెస్ట్
Mahesh Bank | మహేష్ బ్యాంక్ హ్యాకింగ్ కేసులో పురోగతి లభించింది. ఈ కేసులో ఇద్దరు నైజీరియన్లతో పాటు ముంబైకి చెందిన షానవాజ్‌ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముగ్గురిని పంజాగుట్ట పోలీసు స్టేషన్‌కు

హైదరాబాద్ : మహేష్ బ్యాంక్ హ్యాకింగ్ కేసులో పురోగతి లభించింది. ఈ కేసులో ఇద్దరు నైజీరియన్లతో పాటు ముంబైకి చెందిన షానవాజ్‌ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముగ్గురిని పంజాగుట్ట పోలీసు స్టేషన్‌కు తరలించి విచారించినట్లు తెలుస్తోంది. అయితే ముగ్గురి ఖాతాల్లోకి నగదు బదిలీ అయినట్లు పోలీసులు గుర్తించిన సంగతి తెలిసిందే.

ముగ్గురిలో ఇద్దరిని ఇప్పటికే పోలీసులు ప్రశ్నించారు. సర్వర్ హ్యాక్‌తో ఇద్దరికీ సంబంధం లేదని పోలీసులు తేల్చారు. వినోద్, నవీన్ ఖాతాల్లో సైబర్ నేరగాళ్లు నగదు జమ చేశారు. ఇద్దరి ఖాతాల్లో రూ.5 కోట్లకు పైగా జమచేశారు. ఆ తర్వాత ఇద్దరి ఖాతాల నుంచి నగదును ఇతర ఖాతాల్లోకి మళ్లించారు. ఇక.. షానవాజ్ ఖాతాలో రూ.6.9 కోట్లు జమ చేశారు. ఆమె ఈ నెల 11నే అకౌంట్ తెరిచింది. దీంతో హ్యాకర్లతో ఆమెకు సంబంధాలుండే అవకాశాలున్నాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
షానవాజ్ ఖాతా నుంచి ఇతరుల ఖాతాల్లోకి నగదు బదిలీ చేశారు. షానవాజ్ కొన్ని నెలల క్రితం ముంబైలో ఉన్నట్టు గుర్తించారు. సైబర్ క్రిమినల్స్‌కు షానవాజ్ సహకరించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. 3 ఖాతాల నుంచి రూ.12.4 కోట్లు 128 ఖాతాలకు నేరగాళ్లు బదిలీ చేశారు. మరో 200 ఖాతాలకు నగదు బదిలీ కావచ్చని పోలీసుల అనుమానిస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

