Shamshabad Airport | హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా బంగరాం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి 3.5 కిలోల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారాన్ని అక్రమంగా తరలించినట్లు అధికారులు నిర్ధారించారు. బంగారం రవాణాకు సంబంధించి ఎలాంటి ధ్రువపత్రాలు లేవని అధికారులు తేల్చారు. బంగారం ధరలు లక్ష రూపాయాలకు చేరువైన నేపథ్యంలో తక్కువ ధరకు లంభించే దుబాయ్ నుంచి బంగారం స్మగ్లింగ్ చేసి.. ఇక్కడ సొమ్ము చేసుకుంటున్నట్టు తెలిసింది. బంగారం తరలించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.