ఖైరతాబాద్, జనవరి 15: నిమ్స్ వ్యవస్థాపక డైరెక్టర్ దివంగత ప్రొఫెసర్ కాకర్ల సుబ్బారావు శతజయంతి వేడుకల్లో భాగంగా ఫిబ్రవరి 2వ తేదీన సొసైటీ ఆఫ్ ఇండియాన్ రేడియోగ్రాఫర్స్, నిమ్స్ రేడియాల విభాగాల ఆధ్వర్యంలో ఆ అంశంపై జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప తెలిపారు. ఈ మేరకు నిమ్స్‌లో సదస్సుకు సంబంధించిన బ్రోచర్లను నిమ్స్ డీన్ డాక్టర్ లీజా రాజశేఖర్, రేడియో డయాగ్నస్టిక్స్ విభాగాధిపతి డాక్టర్ అనుకపూర్, రేడియోలజీ కళాశాల ప్రిన్సిపాల్ శీరందాస్ శ్రీనివాస్, ఇండియన్ రేడియోగ్రాఫర్స్ అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ దామోదర నాయుడుతో కలిసి ఆవిష్కరించారు.