రవీంద్రభారతి, ఆగస్టు 19: గీతా ఫౌండేషన్ 18వ వార్షికోత్సవాన్ని ఈ నెల 29న రవీంద్రభారతిలో నిర్వహించనున్నట్లు ఫౌండేషన్ చైర్మన్ బైలూర్ యోగేశ్ ప్రభు తెలిపారు. ఈ మేరకు బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో బైలూర్ యోగేశ్ ప్రభు మాట్లాడుతూ పెద్దల్లో జ్ఞానం, పిల్లల్లో చైతన్యం తీసుకురావడమే ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు.
ఇందులో భాగంగానే విష్ణు సహస్రనామం పారాయణం, భగవద్గీత పారాయణం శ్లోకాలపై విద్యార్థులకు పోటీలు, భజన కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, సీబీఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ, అర్చక సంఘాల ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశంలో బనారస్ స్వామీజీ, తెలుగు భాషా చైతన్య సమితి అధ్యక్షుడు బడేసాబ్, రామకృష్ణ చంద్రమౌళి, మనహర్ మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.