మారేడ్పల్లి, ఏప్రిల్ 11: గోదావరి ఎక్స్ప్రెస్ రైల్లో నగరానికి వస్తున్న ప్రయాణికురాలికి చెందిన నగలు, నగదు చోరీకి గురి కావడంతో బాధితురాలు సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి నాగరత్నం కుమారి గృహిణి.
ఈనెల 10వ తేదీన గోదావరి ఎక్స్ప్రెస్ రైలు ఎక్కి నగరానికి వస్తున్నది. మార్గమధ్యలో నాగరత్నం 25 తులాల బంగారు నగలు, 50 వేల నగదు ఉన్న తన హ్యాండ్ బ్యాగ్ తన బెర్త్ పై ఉంచి నిద్రపోయింది. శుక్రవారం తెల్లవారుజామున రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకున్న అనంతరం నిత్రలేచి చూడగా.. హ్యాండ్ బ్యాగ్లో ఉన్న పర్సు కనిపించలేదు. దీంతో ఆమె సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.