e-cigarettes | హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో భారీగా ఈ-సిగరెట్లతో పాటు విదేశీ సిగరెట్లు పట్టుబడ్డాయి. అంతర్ రాష్ట్ర స్మగ్లర్ల నుంచి రూ. 25 లక్షల విలువ చేసే నిషేధిత సిగరెట్లను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులు తెలిపారు.
నిషేధిత సిగరెట్లను స్మగ్లింగ్ చేస్తున్న వారిని అబ్దుల్లా శెట్టి(ముంబై), మహమ్మద్ తజుద్దీన్(మెహిదీపట్నం), మహమ్మద్ షమీ(గోల్కొండ), మహమ్మద్ సోహైల్ ఖాన్(గోల్కొండ), ఖలీల్ అహ్మద్(బోరబండ), మయాంక్ బైస్(ఇండోర్) గా గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ సిగరెట్లను దుబాయి నుంచి అక్రమంగా తీసుకొచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది.
ప్లాటినం సెవెన్ కూల్ సిగరెట్లు 6800 ప్యాకెట్లు, ఎల్ఫ్బర్ ఈ సిగరెట్లు 360 ప్యాకెట్లు, స్కూటర్, ఆరు మొబైల్స్‌ను పోలీసులు సీజ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.