సిటీబ్యూరో, మే 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అవతరణ దినోత్సవాలను ట్యాంక్‌బండ్‌పై నిర్వహిస్తుండటంతో ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం అర్ధరాత్రి వరకు 24 గంటల పాటు ట్యాంక్‌బండ్‌పైకి సాధారణ వాహనాల అనుమతి ఉండదని నగర ట్రాఫిక్ అదనపు సీపీ తెలిపారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ నుంచి ట్యాంక్ బండ్ వైపు, రవీంద్రభారతి నుంచి ట్యాంక్‌బండ్‌పైకి, ఎన్టీఆర్ మార్గ్ నుంచి ట్యాంక్‌బండ్‌పైకి, జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్‌పైకి వచ్చే ఆయా రూట్లలోని వాహనాలను మళ్లిస్తున్నట్లు ట్రాఫిక్ అదనపు సీపీ వివరించారు.