గ్రేటర్లో మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. 24/7 గంటలు గస్తీ తిరుగుతూ ముంపు ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సమస్యను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు. ఖైరతాబాద్ సర్కిల్ పరిధిలో లోతట్టు ప్రాంతాలు చాలా ఉన్నాయి. గతానుభవాలను దృష్టిలో పెట్టుకొని అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ఉదయం, సాయంత్రం, రాత్రి వేళల్లో ప్రజలకు అందుబాటులో ఉండేలా మూడు షిప్టుల్లో పర్యవేక్షణ, క్షేత్రస్థాయి అధికారులతో పాటు జీహెచ్ఎంసీలోని అన్ని విభాగాల సిబ్బందిని భాగస్వాములను చేస్తూ మాన్సూన్ టీమ్‌లను నియమించారు. సమస్యలు తలెత్తితే సంబంధిత అధికారులను సంప్రదించాలని డిప్యూటీ కమిషనర్ మోహన్ రెడ్డి తెలిపారు.
– ఖైరతాబాద్, జూలై 20
కంట్రోల్ రూమ్ ఏర్పాటు
వరద, ముంపు సమస్యలను పరిష్కరించేందుకు జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. సర్కిల్ 17 డిప్యూటీ కమిషనర్ మోహన్ రెడ్డి, ఈఈ ఇందిరా బాయి పర్యవేక్షణలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు సూపర్వైజర్ అధికారిగా అసిస్టెంట్ ఎంటమాలజిస్ట్ బి. భాస్కర్ (8008060413), మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 10గంటల వరకు ఏసీ (ట్రాన్స్పోర్ట్) హరీశ్ (7995009104), రాత్రి 10 నుంచి ఉదయం 6గంటల వరకు ఏఈ భరత్ (7995009076), వారికి సహాయంగా ముగ్గురు జవాన్లు అందుబాటులో ఉంటారు.
స్టాటిక్ సిబ్బంది.. అందుబాటులో ఉండే ప్రాంతాలు
పంజాగుట్ట మోడల్ హౌస్, విల్లామేరీ కళాశాల, చింతల్‌బస్తీ, మారుతీనగర్, ఖైరతాబాద్ వార్డు కార్యాలయం, ఓల్డ్ సీఐబీ క్వార్టర్స్, ఎన్టీఆర్ మార్గ్, ఎంఎస్ మక్తా, బీఎస్ మక్తా, హరిగేట్, సీఎం క్యాంపు ఆఫీసు, మైత్రీవనం, శ్రీనగర్‌కాలనీ పెట్రోల్ పంప్, సోమాజిగూడ ఇండియన్ అయిల్ పెట్రోల్ పంప్, బుద్ధ్దనగర్, బల్కంపేట ఆర్యూబీ, గంగుబాయి బస్తీ, తహసీల్దార్ ఆఫీస్, కుమ్మర్బస్తీ, కుందన్‌బాగ్ ప్రధాన రహదారి, ఫతేనగర్ ఫ్లై ఓవర్, బాల్కంపేట మెయిన్ రోడ్, వీడియోకాన్ గోడౌన్, శివాజీనగర్ తదితర ప్రాంతాల్లో అధికారులు అందుబాటులో ఉంటారు.