నాని కార్స్లో భారీ అగ్ని ప్రమాదం
సెకండ్ హ్యాండ్ కార్స్ షోరూమ్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో పెద్దఎత్తున కార్లు కాలి బూడిదయ్యాయి. జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.
- కాలి బూడిదైన 23 కార్లు భారీగా ఆస్తి నష్టం
బంజారాహిల్స్, ఏప్రిల్ 23: సెకండ్ హ్యాండ్ కార్స్ షోరూమ్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో పెద్దఎత్తున కార్లు కాలి బూడిదయ్యాయి. జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. యూసుఫ్‌గూడ గణపతి కాంప్లెక్స్ సమీపంలో ఉన్న శ్రీ నాని కార్స్ అనే సెకండ్ హ్యాండ్ కార్ల విక్రయ కేంద్రంలో మంగళవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. కార్లను విక్రయించేందుకు పెట్టిన కస్టమర్ల వాహనాలతో పాటు కొంతమంది డీలర్లు పార్క్ చేసిన కార్లు క్షణాల్లోనే మంటల్లో చిక్కుకున్నాయి. నాని కార్స్ ఆఫీసులో పనిచేసే అంజాద్ మంటలను గమనించి, కొన్ని కార్లను బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నించాడు. అయితే, గదిలో కీస్ ఉండటంతో వీలుకాలేదు. తన యజయాని నరేందర్ అలియాస్ నానికి సమాచారమివ్వడంతో అతడు అక్కడికి చేరుకుని రెండు మూడు కార్ల అద్దాలు పగలగొట్టి లోనికి వెళ్లి కార్లను నెట్టుకుంటూ బయటకు తీసుకువచ్చారు.
స్థానికులు సమాచారం ఇవ్వడంతో జూబ్లీహిల్స్ ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలార్పారు. అయితే, అప్పటికే ఆవరణలో ఉన్న అన్ని కార్లకు మంటలంటుకోవడంతో బుగ్గిపాలయ్యాయి. 19 కార్లు పూర్తిగా కాలిపోగా, 4 కార్లు పాక్షికంగా దెబ్బతిన్నట్లు జూబ్లీహిల్స్ పోలీసులు గుర్తించారు. నాని కార్స్ యజమాని నరేందర్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వేసవికాలం కావడంతో విపరీతమైన వేడికి తోడు బ్యాటరీలో ఏర్పడిన సమస్యతో ప్రమాదం చోటు చేసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాతనే అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలుస్తాయని తెలిపారు. కాగా, తమ కార్లను విక్రయించగా వచ్చిన డబ్బుకు మరింత డబ్బు కలిపి కొత్త కార్లను కొనుక్కోవాలన్న ఆశతో కార్లను అక్కడ పెడితే.. అవి కాలి బూడిదయ్యాయని పలువురు కస్టమర్లు ఆవేదన వ్యక్తం చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

