ఆదివారం 24 జనవరి 2021
Hyderabad - Dec 03, 2020 , 08:17:12

ఐటీఐలో ప్రాక్టికల్‌ పరీక్షలు ముగింపు

ఐటీఐలో ప్రాక్టికల్‌ పరీక్షలు ముగింపు

పర్యవేక్షించిన ఆర్‌డీడీ ప్యారం నర్సయ్య

సుల్తాన్‌బజార్‌: కొవిడ్‌ నిబంధనలకు అణుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పరీక్షలను సజావుగా నిర్వహించడం అభినందనీయమని రాష్ట్ర ఉపాధి శిక్షణ శాఖ ప్రాంతీయ ఉప సంచాలకులు ప్యారం నర్సయ్య పేర్కొన్నారు. బుధవారం మల్లేపల్లి ఐటీఐలో కొనసాగుతున్న పరీక్షల్లో చివరి ప్రాక్టికల్‌ పరీక్షా కేంద్రాన్ని ఆయన  ప్రిన్సిపాల్‌ జ్యోతిరాణి,టీవో ఎంబీ కృష్ణాయాదవ్‌,ఏటీవోలు సుధాకర్‌రెడ్డి, సత్యనారాయణలతో కలిసి పరిశీలించారు.పరీక్ష జరుగుతున్న తీరును ప్రిన్సిపాల్‌ను ఆయన అడిగి తెలుసుకున్నారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ఐటీఐలో శిక్షణ పొం దే విద్యార్థులకు ఆన్‌లైన్‌లోనే థియరీ తరగతులను విద్యా సంవత్సరం నష్టపోకుండా పూర్తి చేసేటట్లు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. logo