శనివారం 30 మే 2020
Hyderabad - May 08, 2020 , 00:33:38

చేతనైనంత సాయం

చేతనైనంత సాయం

 • రాజేంద్రనగర్‌ జాగృతి కన్వీనర్‌ రగడంపల్లి శ్రావణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో  ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ జీహెచ్‌ఎంసీ కార్మికులకు 1000 మాస్కులు అందజేశారు. 
 • కుత్బుల్లాపూర్‌ డివిజన్‌ పద్మానగర్‌ ఫేజ్‌-1లో 300మంది పేదలకు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌, డివిజన్‌ అధ్యక్షుడు కేఎం గౌరీశ్‌ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. రంగారెడ్డి నగర్‌ డివిజన్‌లోని గురుమూర్తినగర్‌లో నిత్యావసర సరుకులు అందజేశారు.
 • నిజాంపేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని ఒడిశాకు చెందిన వలస కూలీలకు  తెలంగాణ స్టేట్‌ మోడల్‌ స్కూల్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు బి. కొండయ్య ఆధ్వర్యంలో డిప్యూటీ మేయర్‌ ధన్‌రాజుయాదవ్‌ నిత్యావసర సరుకులు అందజేశారు. 
 • సూరారంకు చెందిన టీఆర్‌ఎస్‌ యువనేత వై.సంతోష్‌రెడ్డి సుభాష్‌నగర్‌ డివిజన్‌ పరిధిలోని జీవన్‌జ్యోతినగర్‌లో సుమారు 140 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
 • టీఆర్‌ఎస్‌ ఉప్పల్‌ డివిజన్‌ అధ్యక్షుడు వేముల సంతోష్‌రెడ్డి, సీనియర్‌ నాయకుడు అరటికాయల భాస్కర్‌ ముదిరాజ్‌ ఆధ్వర్యంలో, ఎస్‌ఎన్‌ఎస్‌ అధినేత శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో విజయపురి కాలనీలో ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి సరుకులు అందజేశారు. గిరిబాబు, వెంకటేశ్వర్‌రావు, మన్నె నర్సింహారెడ్డి , నారాయణరెడ్డి, గిరిబాబు,  మధుసూదన్‌రెడ్డి, మల్లేశ్‌ యాదవ్‌ పాల్గొన్నారు. 
 • రామంతాపూర్‌లోని జననీ ప్రైవేటు వైద్యశాల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి పేదలకు సరుకులు ఇచ్చారు.
 • నార్సింగి మున్సిపాలిటీ పరిధిలో లక్ష్య ఫుడ్స్‌వేస్‌ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌ రేఖాయాదగిరి గౌలిదొడ్డి పరిసర ప్రాంతాల్లోని వలస కార్మికులకు ఆహార ప్యాకెట్లను అందజేశారు.
 • నేరేడ్‌మెట్‌లోని సూపర్‌ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రతి రోజూ 2500 మందికి భోజనం అందజేస్తున్నారు.
 • వైశాఖ పౌర్ణమి సందర్భంగా శంషాబాద్‌లో పేదలకు సిద్ధేశ్వర ఆలయ భక్తులు అన్నదానం చేశారు.
 • శంషాబాద్‌ మల్కారం సొసైటీలో వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు.
 • బండ్లగూడలో కేసీదాస్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ అనుబంధ సంస్థ సంధ్యావందన అభ్యసన శిక్షణ సమితి గౌరవ అధ్యక్షుడు కల్వకొలను శ్రీరామచంద్రమూర్తి ఆధ్వర్యంలో పేద వేదపండితులకు గురువారం ఒక్కొక్కరికీ రూ.1500, పండ్లు అందజేశారు. మిర్తిపాటి వెంకట రామయ్య 50 మంది పేద బ్రాహ్మణులకు సాయం అందజేశారు. 
 • పీర్జాదిగూడ నాల్గవ డివిజన్‌లో శ్రీ లక్ష్మీనర్సింహ స్వామి జయంతి సందర్భంగా ఆప్మాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో మంత్రి మల్లారెడ్డి, మేయర్‌ జక్కా వెంకట్‌రెడ్డి, డిప్యూటీ మేయర్‌, కార్పొరేటర్లు మహేశ్వరి, మహేశ్‌, నాయకులు ఈశ్వర్‌రెడ్డి, అంజిరెడ్డి తదితరులు నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. 
 • జవహర్‌నగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని సంతోష్‌నగర్‌లో స్థానికులు జైపాల్‌ రెడ్డి, గోపి, పవన్‌ కుమార్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో మేయర్‌ కావ్య పాల్గొన్నారు.
 • నాగారం మున్సిపాలిటీలో పనిచేస్తున్న 190మంది మున్సిపల్‌ సిబ్బందికి ఎన్‌ఎఫ్‌సీ బ్లూడ్రీమ్‌ పీపుల్‌ ఆధ్వర్యంలో మున్సిపల్‌ చైర్మన్‌ కౌకుట్ల చంద్రారెడ్డి  నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. 
 • జవహర్‌నగర్‌ మున్సిపాలిటీ పరిధిలోని కార్మికనగర్‌, బాలాజీనగర్‌లలో టీఎన్జీవోస్‌ మేడ్చల్‌ జిల్లా అధ్యక్షుడు రవిప్రకాశ్‌ ఆధ్వర్యంలో 400 మందికి భోజన ప్యాకెట్లను అందజేశారు.
 • గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ 13వ వార్డులో చైర్‌పర్సన్‌ మద్దుల లక్ష్మీశ్రీనివాస్‌రెడ్డి, కౌన్సిలర్లు మల్లికార్జున్‌, అమరం జైపాల్‌రెడ్డి, బాలరాజు, పెంటయ్య, నరేందర్‌రెడ్డి 500 మంది  కార్మికులకు సరుకులు పంపిణీ చేశారు.
 • ఎల్బీనగర్‌ ప్రెస్‌క్లబ్‌ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ప్రింట్‌ మీడియాకు చెందిన 100 మంది విలేకరులు, ఫొటోగ్రాఫర్లకు దిల్‌సుఖ్‌నగర్‌ సాయిబాబా సంస్థాన్‌ ట్రస్టు సలహామండలి చైర్మన్‌ గుండా మల్లయ్య, రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి దయాకర్‌రెడ్డి, డాక్టర్‌ రవి కిశోర్‌, సీఐ శ్రీనివాస్‌రెడ్డి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.  
 • నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్‌మెరాజ్‌ హుస్సేన్‌ మల్లేపల్లి, హబీబ్‌నగర్‌, ఆసిఫ్‌నగర్‌, రెడ్‌హిల్స్‌ ప్రాంతాల్లో పేదలకు సరుకులు పంపిణీ చేశారు.
 • గోషామహల్‌ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు నందకిశోర్‌ వ్యాస్‌ పేదలకు సరుకులు అందజేశారు.
 • కార్పొరేటర్‌ మమత సంతోష్‌గుప్తా గన్‌ఫౌండ్రి డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. 
 • ఓల్డ్‌బోయిన్‌పల్లి డివిజన్‌లో జీహెచ్‌ఎంసీ సిబ్బందికి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, డివిజన్‌ కార్పొరేటర్‌ ముద్దం నర్సింహయాదవ్‌ సరుకులు పంపిణీ చేశారు. నరేందర్‌గౌడ్‌, చందుయాదవ్‌, మల్లేశ్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. 
 • అల్వాల్‌లోని లక్ష్మీకళామందిర్‌ ఆవరణలో పారిశుధ్య కార్మికులకు, విద్యుత్‌ శాఖ సిబ్బందికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌ రావు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. 
 • అఖిల భారత యాదవ మహాసభ మేడ్చల్‌ జిల్లా మహిళా విభాగం ఆధ్వర్యంలో నాచారం, మల్లాపూర్‌లో పేదలకు నిత్యావసర సరుకులను జిల్లా మహిళా అధ్యక్షురాలు ఎంబీ. దురా ్గమాధవియాదవ్‌ పంపిణీ చేశారు. బీబీసాహెబ్‌మక్తా డివిజన్‌లో కార్పొరేటర్‌ లేతాకుల మాధవి ఆధ్వర్యంలో పేదలకు ఆహార ప్యాకెట్లను టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర నాయకుడు రఘుపతిరెడ్డి అందజేశారు.
 • కంటోన్మెంట్‌లోని రసూల్‌పురా, సిల్వర్‌కంపెనీలో పేద కుటుంబాలకు రెండో వార్డు సభ్యుడు సాదాకేశవరెడ్డి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఎస్వీ మెస్‌ నిర్వాహకుడు శ్రీనివాస్‌ పోలీసులకు అల్పాహారాన్ని అందజేశారు. అశోక్‌కుమార్‌గౌడ్‌, జబ్బార్‌ పాల్గొన్నారు.
 • బోయిన్‌పల్లిలోని నేతాజీనగర్‌లో బోయిన్‌పల్లి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ టీఎన్‌ శ్రీనివాస్‌, మార్కెట్‌ డైరెక్టర్లు శ్రీనివాస్‌, నాయకులు టింకుగౌడ్‌, న్యాయవాది సులేమాన్‌ సరుకులు ఇచ్చారు. 
 • మాదాపూర్‌ డివిజన్‌ ఆదిత్యనగర్‌లోని సెయింట్‌ ఇసాక్‌ అడ్వెంట్‌ హై స్కూల్‌ ఆధ్వర్యంలో 450 మంది వలస కార్మికులకు కార్పొరేటర్‌ జగదీశ్వర్‌గౌడ్‌తో కలిసి స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వవిప్‌ అరెకపూడి గాంధీ సరుకులు పంపిణీ చేశారు. 
 • ఏవీఐఎస్‌ హాస్పిటల్‌, టీఆర్‌ఎస్‌ కేవీ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్‌ ఆధ్వర్యంలో బాగ్‌లింగంపల్లిలో ఆటో కార్మికులకు ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, కార్పొరేటర్‌ శ్రీనివాస్‌ రెడ్డి నిత్యావసరాల పంపిణీ చేశారు.  డాక్టర్‌ రాఘవ సునీల్‌, శంకర్‌ రావు, టీఆర్‌ఎస్‌ కేవీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, పార్టీ నాయకులు రేశం మల్లేశ్‌, శ్యామ్‌, దామోదర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
 • ముషీరాబాద్‌ వాలీబాల్‌ గ్రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు సుధాకర్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, డివిజన్‌ అధ్యక్షుడు హైమత్‌ భక్తిఆర్‌, ముచ్చకుర్తి ప్రభాకర్‌, తదితరులు పేద ప్రజలకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
 • మైనంపల్లి ట్రస్ట్‌ చైర్మన్‌ బద్దం మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో గాంధీనగర్‌లో పేదలకు నిత్యావసర సరుకులను ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, తదితరులు  పంపిణీ చేశారు


logo