శనివారం 06 జూన్ 2020
Hyderabad - May 03, 2020 , 23:57:38

అమాయకులకు వల..

అమాయకులకు వల..

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఉద్యో గ ప్రయత్నంలో  ఓ యువతి రెజ్యూమ్‌ను నౌకరి.కామ్‌లో అప్‌లోడ్‌ చేసింది. దీంతో  సైబర్‌నేరగాళ్లు కోటక్‌ మహీంద్రలో ఉద్యో గం ఇప్పిస్తామంటూ నమ్మించారు.  ఆ తర్వాత రిజి్రస్ట్రేషన్‌, టెలిపోనిక్‌ ఇంట ర్వ్యూ, డిపాజిట్‌ అంటూ రూ. 27వేలు వసూలు చేశారు. మళ్లీ అడుగుతుండడం తో బాధితురాలు ఆదివారం సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌లో ఫిర్యాదు చేసింది. మరోఘటనలో గూగుల్‌ సర్చ్‌లో కస్టమర్‌ కేర్‌ నంబర్‌ కోసం యత్నించిన ఓ కాంట్రాక్టర్‌ సైబర్‌నేరగాళ్ల చేతిలో చిక్కి రూ.97వేలు పొగొట్టుకున్నాడు.  తన స్నేహితుడికి గూగుల్‌ పేలో రూ.2 వేలు పంపించాడు. అతడికి డెబిట్‌ అయినట్లు చూపిస్తున్నా, స్నేహితుడికి ఆ డబ్బు  చేరలేదు. కస్టమర్‌ కేర్‌ కోసం సెర్చ్‌ చేయగా  ఒక నంబర్‌ లభించింది. దానికి ఫోన్‌ చేయడంతో గూగుల్‌ పే కస్టమర్‌ ప్రతినిధులమంటూ, ఎనీ డెస్క్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటూ సూచించారు. ఆ కోడ్‌ను బాధితుడి వద్ద నుంచి తీసుకున్నా రు. దీంతో రూ. 97 వేలు ఖాళీ చేశారు. 


logo