శనివారం 06 జూన్ 2020
Hyderabad - Mar 28, 2020 , 23:03:46

అప్పుడప్పుడు.. అష్టాచెమ్మా...

అప్పుడప్పుడు.. అష్టాచెమ్మా...

  • ఇళ్లే ఆటస్థలంగా ప్రజల కాలక్షేపం 
  • చిన్నపెద్దా తేడాలేకుండా ఆటవిడుపు పొందేందుకు యత్నం

సిటీబ్యూరో/ చందానగర్‌/ మణికొండ, నమస్తే తెలంగాణ: అటు కరోనా భయం. ఇటు లాక్‌డౌన్‌.. బయటికెళ్లాల్సిన పనిలేదు. ఎక్కడికైనా వెళదామంటే అంతా బంద్‌. ఇంట్లోనే ఉండాలి. అయితే టీవీ.. లేదంటే మొబైల్‌ వీటితో ఎంత సేపు గడపగలం. సోషల్‌మీడియాతో ఎంతసేపు నెట్టుకురాగలం. రోజు బోర్‌కొట్టించే వీటితో ఏప్రిల్‌ 14వరకు ఎలా గడపగలం. అందుకే నగరవాసులు పంథామార్చి ఇంట్లోనే ఆటవిడుపు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు.. వరుస సెలవుల దృష్ట్యా.. కొత్తగా గడిపేందుకు సన్నద్ధమవుతున్నారు. బయటికెళ్లాల్సిన పనిలేకుండా ఇంటిళ్లిపాది కాలక్షేపం చేస్తున్నారు. వీడియోగేమ్‌లు, మొబైల్‌ గేమ్స్‌లో ఇంతకాలం మరుగునపడ్డ పాతతరం ఆటలన్నీ తెరపైకి వచ్చాయి.


ఇళ్లే ఆట స్థలం.. : బయటికెళ్లాల్సిన పనిలేకుండా ఇంటినే చిన్నపాటి ఆటస్థలంగా మార్చేసుకుంటున్నారు. ఆటలంటే పిల్లలకు అత్యంత ఇష్టం.. పాటలంటే మరీ ఇష్టం. పిల్లలు పెద్దలు అంతా కలిసి ఇంట్లోనే పలు ఇండోర్‌గేమ్స్‌ను ఆడుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. కాలక్షేపం చేయడమే కాదు... కాస్త విజ్ఞానాన్ని ఆర్జిస్తున్నారు. అపార్టుమెంట్లు, బస్తీలు, గెటెడ్‌ కమ్యూనిటీలన్న తేడాల్లేకుండా పిల్లలు, మహిళలు, పచ్చీస్‌, లూడో, హౌజీ, చదరంగం, క్యారం బోర్డు, మ్యూజికల్‌ చైర్‌, అష్టాచెమ్మా, అంత్యాక్షరి, వైకుంఠపాలి, పులిమేక, పదకేళిలాంటి ఆటలకు జైకొడుతున్నారు. అంతేకాదు కొంతమంది నచ్చిన పుస్తకాన్ని చదివడం, మరికొంత మంది కొత్తది నేర్చుకోవడంపై దృష్టిపెడుతున్నారు.

కరోనాతో ఇంటికే పరిమితమయ్యారు.. 

నగరంలో కర్ఫ్యూ పరిస్థితులు నెలకొనడంతో నిత్యం క్షణం తీరికలేకుండా హడావిడిగా మా వారంతా ఇప్పుడు ఇంటికే పరిమితమయ్యారు. ఇంట్లో తనకు చేదోడువాదోడుగా చిన్నచిన్న పనులకు సహాయం చేస్తున్నారు. సమయానికి భోజనం చేస్తూ చిన్ననాటి జ్ఞాపకాలను పిల్లలకు వివరిస్తూ, పుస్తకాలు, ఆటలు ఆడుతూ కాలక్షేపం చేస్తున్నాం.

- పట్లోళ్ల అలివేలుమంగచంద్రశేఖర్‌రెడ్డి, లెజండ్‌ చిమ్స్‌ గేటెడ్‌ కమ్యూనిటీ, కోకాపేట

పూర్తి సమయం కుటుంబంతో.. 

నిత్యం బిజీగా ఉండే మేము కుటుంబసభ్యులతో కలిసి ఆరురోజులుగా ఇంటిలోనే ఉం టున్నాం. సమయానుకూలంగా వ్యాయా మం, యోగాసనాలు, డైట్‌ ఫుడ్‌ను తీసుకుంటున్నారు. పిల్లతో కలిసి ఆటలాడుతూ, ఆస క్తి కరమైన కథలను చెప్పుకుంటూ కాలాన్ని వెల్లదీస్తున్నారు. 

-మణిమాల రమేశ్‌, ఇంటీరియర్‌ డిజైనర్‌


logo