హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక (Jubilee Hill By-Election) పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం 11 గంటల వరకు 20.76 శాతం పోలింగ్ నమోదయింది. మరోవైపు నియోజకవర్గంలో స్థానికేతరులు ఉండటంపై సీఈవో సుదర్శన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నాన్లోకల్స్పై కేసులు నమోదుచేయాలని ఆదేశించారు. ఇప్పటి వరకు నాన్ లోకల్స్పై 3 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని తెలిపారు. మాక్ పోలింగ్లో ఈవీఎంలు మొరాయించాయన్నారు. దీంతో 9 చోట్ల ఈవీఎంలను మార్చామని చెప్పారు. ప్రస్తుతం పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నదని వెల్లడించారు.
ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించిన స్థానికేతర ప్రజాప్రతినిధులపై కేసులు పెట్టామని జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ తెలిపారు. కోడ్ ఉల్లంఘించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను గుర్తించామన్నారు. కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోలింగ్ బూత్ల వద్ద ఉన్నారని చెప్పారు.