హైదరాబాద్: రాజధానిలో కురుస్తున్న వర్షాలతో హుస్సేన్‌సాగర్ (Hussain Sagar) పూర్తిగా నిండిపోయింది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చిచేరుతుండటంతో నీటిమట్టం పెరిగింది. దీంతో అధికారులు రెండు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ట్యాంక్‌బండ్‌లో ప్రస్తుతం 513 అడుగుల మేర నీరు ఉన్నది. చెరువు పూర్తిస్థాయి సామర్థ్యం 514 అడుగులు.
ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కూకట్పల్లి, బంజారా, బుల్కాపూర్, పికెట నాలాల నుంచి పెద్దఎత్తున వరద వస్తున్నది. ఈ నేపథ్యంలో దిగువకు వచ్చే నీరు మరింత పెరిగే అవకాశం ఉండటంతో లోతట్టుప్రాంతాల ప్రజలను జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు. కాగా, ఆదివారం హైదరాబాద్‌లో వాన దంచికొట్టింది.
యూసుఫ్‌గూడలో అత్యధికంగా 9.48 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. షేక్‌పేటలో 8.45, మారేడ్‌పల్లిలో 8.4, ఖైరతాబాద్‌లో 8.4, ముషీరాబాద్‌లో 8.2, శేరిలింగంపల్లిలో 7.93, ముషీరాబాద్ 7.3, జూబ్లీహిల్స్ ఎంసీఆర్హెచ్ఆర్డీ 7.2, హెచ్‌సీయూ, మాదాపూర్ 6.95, నాచారం 6.88, సీతాఫల్మండి 6.85, బన్సీలాల్‌పేట, మోండా మార్కెట్ 6.28, పాటిగడ్డ, బుద్ధానగర్ 6.15, ఉప్పల్ చిలుకానగర్ 6.0, అల్లాపూర్, ఉస్మానియా యూనివర్సిటీ 5.90, రహ్మత్‌నగర్, భోలక్‌పూర్ 5.73, మౌలాలి, ఓల్డ్ సుల్తాన్‌నగర్ 5.55, గచ్చిబౌలి, ఉప్పల్ 5.40, బేగంపేట 5.20 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది.