సిటీబ్యూరో, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన మోంథా తుఫాను ముంచుకొస్తోంది. దీని ప్రభావంతో గ్రేటర్లో కూడా పలు చోట్ల ఉరుములు, మెరుపుల, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వానలు కురిసే అవకాశమున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
కాగా నగరంలో ఉదయం నుంచి రాత్రి వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 31.8డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 22.5డిగ్రీలు, గాలిలో తేమ 60శాతంగా నమోదై ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.