మూసీ-ఈసీపై 15 వంతెనలు
చారిత్రక మూసీ, ఈసీ నదులపై ఏకకాలంలో 15 చోట్ల కొత్త వంతెనల నిర్మాణానికి కీలక అడుగు పడింది. పర్యాటకానికి మరింత వన్నె తీసుకువచ్చే విధంగా రూపొందించిన డిజైన్‌ను ఖరారు చేశారు. ఈ నెలాఖరులోగా ప్రభుత్వ అనుమతితో హెచ్ఆర్డీసీఎల్, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, కుడా శాఖలు ఈ బ్రిడ్జిల నిర్మాణానికి టెండర్లను ఆహ్వానించి
- నగర సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఏర్పాట్లు
- డిజైన్లు ఖరారు, త్వరలో నిర్మాణ పనులకు టెండర్లు
- రూ. 545 కోట్లతో పనులు చేపట్టనున్న..
- హెచ్ఆర్డీసీఎల్, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, కుడా
సిటీబ్యూరో, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ) : చారిత్రక మూసీ, ఈసీ నదులపై ఏకకాలంలో 15 చోట్ల కొత్త వంతెనల నిర్మాణానికి కీలక అడుగు పడింది. పర్యాటకానికి మరింత వన్నె తీసుకువచ్చే విధంగా రూపొందించిన డిజైన్‌ను ఖరారు చేశారు. ఈ నెలాఖరులోగా ప్రభుత్వ అనుమతితో హెచ్ఆర్డీసీఎల్, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, కుడా శాఖలు ఈ బ్రిడ్జిల నిర్మాణానికి టెండర్లను ఆహ్వానించి పనులు చేపట్టనున్నాయి. ఆయా ప్రాంతాల్లో సాఫీ ప్రయాణంతో పాటు పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం రూ.545 కోట్లు మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
శాఖల వారీగా బ్రిడ్జిల నిర్మాణం చేపట్టనున్న వివరాలు
జీహెచ్ఎంసీ రూ.168కోట్లు
- మూసీపై ఇబ్రహీంబాగ్ కాజ్‌వేను కలుపుతూ హైలెవల్ బ్రిడ్జి రూ.39కోట్లు
- మూసారంబాగ్ను కలుపుతూ హైలెవల్ బ్రిడ్జి రూ.52కోట్లు
- చాదర్‌ఘాట్ వద్ద హైలెవల్ బ్రిడ్జి రూ.42కోట్లు
- అత్తాపూర్ వద్ద ఉన్న బ్రిడ్జికి సమాంతరంగా కొత్త బ్రిడ్జిలు రూ.35కోట్లు
- హెచ్ఆర్డీసీఎల్ రూ.116కోట్లు
- కారిడార్ నంబరు 99మిస్సింగ్ లింక్ వద్ద హైలెవల్ బ్రిడ్జి రూ.52కోట్లు
- ఈసాపై సన్‌సిటీ-చింతల్మెట్ కలుపుతూ హైలెవల్ బ్రిడ్జి (పవర్ కారిడార్) రూ.32కోట్లు
- బండ్లగూడ జాగీర్‌లో ఈసాపై ఇన్నర్‌రింగ్ వద్ద హైలెవల్ బ్రిడ్జి రూ.32కోట్లు
- హెచ్ఎండీఏ రూ.221 కోట్లు
- ఉప్పల్ లేఅవుట్-మూసీ దక్షిణ ఒడ్డును కలుపుతూ కొత్త బ్రిడ్జి రూ.42కోట్లు
- మంచిరేవుల-నార్సింగిని కలుపుతూ హైలెవల్ బ్రిడ్జి రూ.39కోట్లు
- బుద్వేల్ వద్ద ఈసీకి సమాంతరంగా ఐటీ పార్కులు, కనెక్టింగ్ రోడ్లను కలుపుతూ హైలెవల్ బ్రిడ్జి రూ.32కోట్లు
- హైదర్హాకోట్-రామ్‌దేవ్‌గూడల మధ్య కొత్త వంతెన రూ.42కోట్లు
- బుద్వేల్ వద్ద రెండో కొత్త బ్రిడ్జి రూ.20కోట్లు
- ప్రతాపసింగారం-గౌరెల్లి హైలెవల్ బ్రిడ్జి రూ.35కోట్లు
- మంచిరేవుల వంతెనను కలుపుతూ కొత్త లింకు రోడ్డు రూ.11కోట్లు
- ఆఫ్జల్‌గంజ్, ఐకానిక్ పెడస్ట్రియన్ బ్రిడ్జి కుడా సంస్థ రూ.40.80 కోట్లు
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Built
- musi river
- New bridges
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

