దుండిగల్, జూన్ 8: ఇంటిముందు ఆడుకుంటున్న 15 నెలల చిన్నారిపై వీధికుక్కలు దాడిచేసి గాయపరిచాయి.ఈ ఘటన డీ.పోచంపల్లి పరిధిలో శనివారం సాయంత్రం జరిగింది. బీహార్‌కు చెందిన మింటూసింగ్, నీమాదేవి దంపతులు డీ. పోచంపల్లి సత్యసాయి కాలనీలో నివాసముంటున్నారు .
వీరి మూడో కుమార్తె ఆరుషి శనివారం సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటుండగా అటుగా వచ్చిన రెండు వీధికుక్కలు దాడిచేసి గాయపరిచాయి. అరుపులు విన్న కుటుంబసభ్యులు.. కుక్కలను చెదరగొట్టి చిన్నారిని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించి చికిత్స చేయిస్తున్నారు. మరో ఘటనలో నిజాంపేట జర్నలిస్టు కాలనీలో సాయిచరణ్ (14) అనే బాలుడిపై వీధి కుక్కలు దాడిచేయడంతో గాయాలయ్యాయి.