సిటీబ్యూరో, జనవరి 6 (నమస్తే తెలంగాణ) : ప్రజావాణిలో వచ్చిన వినతులను త్వరితగతిన పరిష్కరించాలని జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి అధికారులను సోమవారం ఆదేశించారు. ప్రజల సమస్యలు పరిష్కరించడంపై అధికారులు చొరవ చూపాలన్నారు. ప్రజావాణి ఫోన్ ఇన్ ప్రోగ్రాం ద్వారా నాలుగు విన్నపాలు రాగా, సత్వర పరిష్కారానికి ఆయా విభాగాలను అందించినట్లు అధికారులు తెలిపారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 44 వినతులు రాగా అందులో టౌన్‌ప్లానింగ్ 10, ఇంజనీరింగ్ 7, ఎఫ్ఏ సెక్షన్ 5, శానిటేషన్ మూడు, ట్యాక్స్, హెల్త్, అడ్మినిస్ట్రేషన్, హౌసింగ్, ఎలక్ట్రికల్, యూబీడీ విభాగాలకు రెండు ఫిర్యాదుల చొప్పున ఫిర్యాదులు వచ్చాయన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ఆరు జోన్లలో మొత్తం 105 వినతులు వచ్చాయని, కూకట్‌పల్లిలో 50, సికింద్రాబాద్ జోన్లో 12, శేరిలింగంపల్లి జోన్లో 18, చార్మినార్ జోన్లో 7, ఎల్భీనగర్ జోన్లో 13, ఖైరతాబాద్ జోన్లో 5 ఆర్జీలతో కలిపి మొత్తం 149 వినతులు వచ్చాయని అధికారులు తెలిపారు.