శంషాబాద్ రూరల్, సెప్టెంబర్ 10: శంషాబాద్ ఎయిర్పోర్టులో రూ.14 కోట్ల విలువైన గంజాయిని ఎయిర్పోర్టు భద్రత అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన ప్రయాణికుడి వద్ద 13.9 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
నిందితుడు హైదరాబాద్కు చెందిన సయ్యద్ రిజ్వీగా గుర్తించారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.14 కోట్లు ఉంటుందని వెల్లడించారు. ఒక వైపు రాష్ట్ర ప్రభుత్వం ఈగల్ టీమ్స్ ఏర్పాటు చేసి మాదకద్రవ్యాల రవాణా కట్టుడికి ప్రయత్నిస్తున్నా.. రాష్ట్రంలో తరచూ గంజాయి, డ్రగ్స్ దందాలు వెలుగు చూస్తున్న తీరు సమస్య తీవ్రతను చాటుతున్నాయి.