Crime News | జవహర్‌నగర్, ఆగస్టు 26: అరుంధతినగర్‌లోని పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. జవహర్‌నగర్ పీఎస్ ఎస్‌హెచ్‌వో నాగరాజు కథనం ప్రకారం.. అరుంధతినగర్ అటవీ ప్రాంతంలో పేకాట ఆడుతున్నట్టు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు మల్కాజిగిరి ఎస్వోటీ, జవహర్‌నగర్ పోలీసులు కలిసి దాడిచేశారు. 12మందిని అరెస్ట్ చేసి, సెల్ఫోన్లు, రూ. 1,90,600 నగదును స్వాధీనం చేసుకున్నారు.
పేకాట రాయుళ్లు నవీన్‌రెడ్డి, ముత్యాల శివకుమార్, చింతల శ్రీనివాస్‌రెడ్డి, పబ్బు శ్రీకాంత్, వక్కంటి శ్రీనివాస్‌రావు, కిందరి మల్లేశ్, ఎండీ ఇమ్రాన్, ఎండీ కాశీం, పెద్దావురి రాజు, చిలుకల మణికంఠ, ఇల్లురి వెంగళ్‌రెడ్డి, వంగరి బాబును అదుపులోకి తీసుకొని జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.