శంషాబాద్ రూరల్ : ప్రజా సమస్యల పరిష్కారం కోసమే 111జీవో ఎత్తి వేయనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆసెంబ్లీలో ప్రకటన చేశారని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ తెలిపారు.
బుధవారం శంషాబాద్ పట్టణంలోని కాపుగడ్డ కాలనీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జంట జలాశయాల పరిరక్షణ కోసం గతంలో తీసుకువచ్చిన 111జీవోతో 84 గ్రామాల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
వారి ఇబ్బందులను గుర్తించిన రాజేంద్రనగర్ , చేవెళ్ల ఎమ్మెల్యేలు పలుమార్లు ముఖ్యమంత్రి కేసీఆర్ కలిసి ఇక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందులను వివరించడంతో స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారన్నారు.
ఇచ్చిన హామిని అమలు చేయడానికి చొరవతీసుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు.
సమావేశంలో మున్సిపల్ చైర్మన్ సుష్మ, వైస్ చైర్మన్ గోపాల్, గణేష్‌గుప్త, ఎంపీపీ జయమ్మ, జడ్పీటీసీ తన్వి, మండల పార్టీ అధ్యక్షుడు కే చంద్రారెడ్డి, వెంకటేశ్ గౌడ్, సర్పంచ్ దండు ఇస్తారితో పాటు పలువురు నాయకులు ఉన్నారు.