శంషాబాద్ రూరల్, జనవరి 4: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో శనివారం సాయంత్రం 5కే, 10 కే రన్ నిర్వహించారు. ఎయిర్‌పోర్టు సీఈవో ప్రదీప్ ఫణికర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీఎంఆర్ హైదరాబాద్(శంషాబాద్) ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో నాల్గో ఎడిషన్‌లో 4300 మంది ఉత్సాహ భరితంగా పాల్గొన్నట్లు తెలిపారు.
ఔత్సాహికలలో ఆరోగ్యం, ఫిట్నెస్ స్నేహసంబంధాన్ని పెంపొందించడానికి ప్రతి ఏడాది ఈ ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రన్లో 18 ఏండ్ల నుంచి 60 ఏండ్ల వయస్సు ఉన్నవారు పాల్గొని విజయవంతం చేశారని వివరించారు. రన్‌తో వినోదంతో పాటు ఆరోగ్యకరమైన ఫ్లాట్‌ఫాంను అందించినట్లు తెలిపారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు.