మహేశ్వరం, అక్టోబర్ 29: బీఆర్ఎస్తోనే అన్ని వర్గాలకు సముచిత స్థానం దక్కుతుందని, తెలంగాణ రాష్ర్టానికి సీఎం కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం మహేశ్వరం గ్రామం కాంగ్రెస్ పార్టీకి చెందిన 100 మంది ముస్లిం నాయకులు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మినాజ్ పటేల్ ఆధ్వర్యంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై చాలా మంది ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో మహేశ్వరం నియోజక వర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని ఆశీర్వదించాలని కోరారు. పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో మహేశ్వరం అభివృద్ధి ప్రదాతగా నిలుస్తున్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మంత్రి సబితా ఇంద్రారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లో చేరిన వారిలో ఎంఏ ఫరీద్, ఎండీ మోసింఖాన్, మోబిన్‌ఖాన్, ముస్తాఫా ఖాద్రీ, అక్బర్ ఖురేషీ, అక్రం హుస్సేన్‌తో పాటు మరికొంత మంది ఉన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అంగోతు రాజు నాయక్, సీనియర్ నాయకులు కరోళ్ల చంద్రయ్య ముదిరాజ్, మినాజ్ పటేల్, కో -ఆప్షన్ సభ్యుడు సయ్యద్ ఆథిల్ అలీ, శివగంగ దేవాలయ చైర్మన్ నిమ్మగూడెం సుధీర్‌గౌడ్, మునగపాటి నవీన్, మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ ఎంఏ సమీర్, ఎస్.కె. ఆజాం, పీఏసీఎస్ డైరెక్టర్ కడమోని ప్రభాకర్, షేక్ అబువాకర్, ఆజీబాబా, ఎస్.కె. అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.