
సైదాబాద్, జనవరి 7 : పాఠశాలల్లో కొనసాగుతున్న కొవిడ్ టీకా కార్యక్రమాన్ని డివిజన్ కార్పొరేటర్ కొత్తకాపు అరుణ పరిశీలించారు. శుక్రవారం శంకేశ్వరబజార్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు కొవిడ్ టీకా వేస్తున్న కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 15 – 18 ఏండ్ల ప్రతీ విద్యార్థి కొవిడ్ టీకాలను తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, గడ్డిఅన్నారం ఆరోగ్య కేంద్రం డాక్టర్ ఇజమాన్, సిస్టర్ మేరి, జయ, కవిత, మహేశ్, వనజ, గుడియా, విజయలక్ష్మి పాల్గొన్నారు.
వయోవృద్ధులకు ఇంటి వద్దే టీకాలు
సీనియర్ సిటిజన్స్ సర్వీస్ ట్రస్ట్ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం ఐఎస్ సదన్ డివిజన్ పరిధిలోని లక్ష్మినగర్ కాలనీలో పలువురికి ఇంటివద్దే రెండోడోస్ టీకాలను వేశారు. దివ్యాంగులు, వయోవృద్ధుల ఇండ్ల వద్దకు వెళ్లి సిబ్బందితో కలిసి టీకాలు వేయిస్తున్నామని సీనియర్ సిటిజన్స్ సర్వీస్ ట్రస్ట్ సంస్థ ప్రతినిధులు ఓఎస్వీడీ ప్రసాద్, నేరళ్ల ప్రసాదరావు, శేషగిరిరావు పేర్కొన్నారు.
టెమ్రీస్లో పదోతరగతి విద్యార్థులకు వ్యాక్సిన్
చాదర్‌ఘాట్, జనవరి 7 : టెమ్రీస్ సైదాబాద్ బాయ్స్ – 1 స్కూల్లో పదో తరగతి విద్యార్థులకు శుక్రవారం కొవిడ్ వ్యాక్సిన్ వేశారు. ప్రభుత్వం సూచించిన మేరకు వ్యాక్సిన్ వేస్తున్నారని ప్రిన్సిపాల్ విద్యాసాగర్ తెలిపారు. కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ పి.నర్మద, ఉపాధ్యాయులు లక్ష్మీప్రియ, శివ, నాజం, హరీశ్, సిబ్బంది గౌసుద్దీన్ పాల్గొన్నారు. ఏఎన్ఎంలు పర్వీన్, జయమ్మ విద్యార్థులకు పాల్గొన్నారు.
విద్యాసంస్థల్లో ముమ్మరంగా వ్యాక్సినేషన్
మలక్‌పేట, జనవరి 7 : కరోనా నియంత్రణలో భాగంగా దిల్‌సుఖ్‌నగర్‌లోని విద్యాసంస్థల్లో చేపట్టిన వ్యాక్సినేషన్ డ్రైవ్ ముమ్మరంగా కొనసాగుతుంది. శుక్రవారం దిల్‌సుఖ్‌నగర్‌లోని సాకేత జూనియర్, డిగ్రీ కళాశాల, న్యూ నోబుల్ డిగ్రీ కళాశాలలో 15-18 ఏండ్లలోపు పిల్లలకు శాలివాహననగర్, పాత మలక్‌పేట పట్టణ ప్రాథిమిక ఆరోగ్య కేంద్రాల ఆధ్వర్యంలో వ్యాక్సిన్లు వేశారు. సాకేత జూనియర్, డిగ్రీ కళాశాలలో కళాశాల చైర్మన్ శ్రీధర్‌రెడ్డి, ప్రిన్సిపాల్ రాంచంద్రారెడ్డి వ్యాక్సినేషన్‌ను ప్రారంభించగా, న్యూ నోబుల్ డిగ్రీ కళాశాలలో కళాశాల ఇన్చార్జి గౌని చంద్రయ్య, ప్రిన్సిపాల్ ప్రేమలత, గడ్డిఅన్నారంలోని నారాయణ కళాశాలలో కార్పొరేటర్ బొక్క భాగ్యలక్ష్మీమధుసూదన్రెడ్డి ప్రారంభించారు. వ్యాక్సిన్ కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య సిబ్బందికి సహకరించాలని, తద్వారా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని తొందరగా పూర్తి చేయవచ్చునని వారు అన్నారు, ఈ సందర్భంగా సాకేత కళాశాలలో 200 మందికి, న్యూ నోబుల్ కళాశాలలో 180 మందికి, నారాయణ కళాశాలలో 200 మందికి వ్యాక్సిన్లు వేశారు. కార్యక్రమంలో ఏఎన్ఎంలు, ఆశవర్కర్లు, కళాశాలల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.