మల్కాజిగిరి, ఏప్రిల్ 22 : త్వరలోనే అల్వాల్ మెడికల్ హబ్‌గా మారనున్నదని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. అల్వాల్‌లో నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ దవాఖానకు రూ.897 కోట్లు కేటాయించినట్లు సీఎం కేసీఆర్ ప్రకటించడంతో శుక్రవారం ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, కార్పొరేటర్ శాంతిశ్రీనివాస్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి సీఎం కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికే మల్కాజిగిరిలో జిల్లా దవాఖాన, మల్కాజిగిరి, అల్వాల్‌లో మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. తాజాగా అల్వాల్‌లో రూ.897 కోట్లతో సూపర్ స్పెషాలిటీ దవాఖాన ఏర్పాటుకు సీఎం కేసీఆర్ నిర్ణయించడం హర్షణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ప్రేమ్‌కుమార్, సునీతాయాదవ్, శాంతిశ్రీనివాస్ రెడ్డి, రాజ్ జితేంద్రనాథ్, మాజీ కార్పొరేటర్ జగదీశ్ గౌడ్, నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు పల్లె విజయకుమారి, సర్కిల్ అధ్యక్షురాలు గద్వాల జ్యోతి, అధికార ప్రతినిధి జీవీఎన్ సతీశ్‌కుమార్, మీడియా ఇన్చార్జి గుండా నిరంజన్, పరశురాంరెడ్డి, శ్రీనివాస్, రాముయాదవ్, , సంతోష్ రాందాస్, భాగ్యనంద్రావు, నాగరాజు, ఉపేందర్, ఇబ్రహీం, నర్సింగ్‌రావు, సూరి, సత్తయ్య, సత్యమూర్తి, పీవీ సత్యనారాయణ, సంధ్య తదితరులు పాల్గొన్నారు.
మౌలిక సదుపాయాలు కల్పిస్తాం..
ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. ఆనంద్‌బాగ్‌లో జరుగుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తిచేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఈ లక్ష్మణ్, డీఈ లౌక్య, ఏఈ సత్య, కార్పొరేటర్ ప్రేమ్‌కుమార్, మాజీ కార్పొరేటర్ జగదీశ్‌గౌడ్, అధికార ప్రతినిధి జీఎన్వీ సతీశ్‌కుమార్, మీడియా ఇన్చార్జి గుండా నిరంజన్, శ్రీనివాస్, రాముయాదవ్, సంతోష్రాందాస్, సంజయ్, సైదులు తదితరులు పాల్గొన్నారు.
బడుగువర్గాల ఆశాజ్యోతి డాక్టర్ అంబేద్కర్
బడుగువర్గాల ఆశాజ్యోతి డాక్టర్ అంబేద్కర్ అని ఎమ్మెల్మే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. మౌలాలిలోని డాక్టర్ అంబేద్కర్ విగ్రహం దిమ్మెను శుక్రవారం ఎమ్మెల్మే పరిశీలించారు. అనంతరం అంబేద్కర్‌కు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ప్రేమ్‌కుమార్, మాజీ కార్పొరేటర్ జగదీశ్ గౌడ్, జీఎన్వీ సతీశ్ కుమార్, నిరంజన్, రాముయాదవ్, భాగ్యనందరావు, నాగేశ్, భాస్కర్, ఎల్లేశ్, ఆదినారాయణ, సంతోష్ నాయుడు, ఇబ్రహీం పాల్గొన్నారు.