ఘట్కేసర్ రూరల్, జూన్ 9 : పేదల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఘట్కేసర్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి అధ్యక్షతన పోచారం, ఘట్కేసర్, పలు గ్రామాలకు చెందిన 68 మంది లబ్ధిదారులకు మంత్రి , జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ఆర్థిక, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నట్లు తెలిపారు.
రైతులకు రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నది దేశంలో తెలంగాణ రాష్ట్రమేనని జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి అన్నారు. ఘట్కేసర్ ,పోచారం మున్సిపల్ చైర్మన్లు పావనీ జంగయ్య యాదవ్, కొండల్ రెడ్డి, వైస్ చైర్మన్లు రెడ్యానాయక్, మాధవ రెడ్డి, సర్పంచులు వెంకటేశ్ గౌడ్, వెంకట్ రెడ్డి, రమాదేవి రాములు గౌడ్, శివశంకర్, కౌన్సిలర్లు రమాదేవి మహిపాల్ గౌడ్, వెంకట్ రెడ్డి, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు రమేశ్, మున్సిపాలిటీల అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, సురేందర్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.