ఉస్మానియా యూనివర్సిటీ, అక్టోబర్ 15 : ఉస్మానియా యూనివర్సిటీ హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ సెంటర్ (హెచ్‌సీడీసీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాకు విశేష స్పందన వచ్చింది. సుమారు 50 వేల మంది హాజరైన ఈ మేళాను శనివారం ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు సృజనాత్మకతతో ఆలోచించి ఆంత్రప్రెన్యూర్స్‌గా ఎదగాలని సూచించారు. మేళాను సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ సందర్శించారు. నిపుణ, సేవా ఇంటర్నేషనల్, ఏబీవీ ఫౌండేషన్, కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్, ఐఎఫ్ఐఎన్ గ్లోబల్, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం, దేవకి ఫౌండేషన్, రైస్ ఫౌండేషన్, జేడీ ఫౌండేషన్, ఐ స్టాండ్ ఫర్ వారియర్స్ తదితర సంస్థల సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, హెచ్‌సీడీసీ డైరెక్టర్ ప్రొఫెసర్ కె. స్టీవెన్సన్, కోఆర్డినేటర్లు ప్రొఫెసర్ ఉమామహేశ్వర్, డాక్టర్ మురళీధర్‌రెడ్డి, డాక్టర్ ప్యాట్రిక్, నిపుణ, సేవా ఇంటర్నేషనల్ సంస్థల వ్యవస్థాపకురాలు మూబరు సుభద్రరాణి, వివిధ సంస్థల ప్రతినిధులు అరుణ్‌కుమార్, శేషాద్రి వనజాల, హరికృష్ణ, హర్ష, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.