గాడియం స్కూల్ 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ‘రన్ ఫర్ రోడ్ సేఫ్టీ’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేశ్ జెండా ఊపి ప్రారంభించారు. సురక్షితమైన, బాధ్యతాయుతమైన సమాజం కావాలంటే రహదారి భద్రత చాలా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.
2కే, 5కే, 10కే రన్ మూడు విభాగాలుగా జరిగిన పోటీల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రు లు, సిబ్బంది సహా 1000 మంది ఉత్సాహంగా పాల్గొన్నారు.
– హైదరాబాద్, ఆట ప్రతినిధి