Zodiac Sign Lucky in July 2025 | ఈ ఏడాది జులై మాసానికి జ్యోతిషశాస్త్రంలో ప్రత్యేక చాలా ఉన్నది. ఈ నెలలో ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఆరు గ్రహాలు రాశులను మార్చుకోబోతున్నాయి. బృహస్పతి, శుక్రుడు, కుజుడు, బుధుడు, సూర్యుడు, శనిగ్రహాలు తమ రాశిచక్రాలను మార్చుకోనున్నాయి. ఈ గ్రహాల స్థానచలనం కారణంగా రాశిచక్రాలపై ప్రభావం ఉంటుంది. ఈ ప్రభావం ప్రపంచంతో పాటు ఆర్థిక వ్యవస్థపై కనిపిస్తుంది. అయితే, ఈ గ్రహాల సంచారం కారణంగా ఆరు రాశుల వారికి మంచి ప్రయోజనాలు కలుగనున్నాయి. ఆదాయం, గౌరవం పెరుగుతుంది. వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితంలో సానులకూల మార్పులు కనిపిస్తాయి.
జులై 9న బుధవరాం రాత్రి 10.50 గంటలకు బృహస్పతి మిథునరాశిలోనే తిరిగి ఉదయిస్తాడు.
జులై 19న ఆదివారం శనైశ్చరుడు ఉదయం 7.24 గంటలకు మీనరాశిలో తిరోగమిస్తాడు.
జులై 16న బుధవారం ప్రత్యక్ష దైవం సూర్యనారాయణుడు సాయంత్రం 5.17 గంటలకు కర్నాటక రాశిలోకి ప్రవేశిస్తాడు.
జులై 18న శుక్రవారం ఉదయం 9.45 గంటలకు కర్కాటకరాశిలో బుధుడు తిరోగమనం చెందుతాడు.
జులై 24న గురువారం సాయంత్రం 7.42 గంటలకు కర్నాటక రాశిలోనే అస్తమిస్తాడు.
జులై 26న శనివారం ఉదయం 8.45 గంటలకు శుక్రుడు మిథునరాశిలోకి ప్రవేశిస్తాడు.
జులై 28న సోమవారం సాయంత్రం 7.02 గంటలకు కుజుడు కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు.
జులై 2025లో ఆయా గ్రహాల సంచారం కారణంగా మేశరాశి జాతకులకు సానుకూలంగా ఉంటుంది. ఈ నెలలలో మీ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కార్యాలయంలో మీ అద్భుతమైన పనితీరుతో మిగతా వారిని అధిగమిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. అదృష్టం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెంపొందడంతో పాటు నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. శని ప్రభావం తగ్గడంతో కుటుంబంలోని చింతలు, ఖర్చులన్నీ తగ్గిపోతాయి. ఆస్తి, సంబంధిత విషయాల్లో కొన్ని ఇబ్బందులుంటాయి. వివాహ జీవితం సంతోషంగా ఉంటుంది. కొత్తగా ఉద్యోగం కోసం చూస్తున్న వారికి మంచి అవకాశం లభిస్తుంది.
వృషభ రాశానికి సైతం జులై నెలలో కలిసి వస్తుంది. అసంపూర్తిగా మిగిలిపోయిన పనులన్నీ పూర్తి చేస్తారు. కొత్త బాధ్యతలను స్వీకరించేందుకు ఇది మంచి సమయం. కష్టపడి పనిచేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో ప్రతి పనిని అంకితభావంతో చేస్తారు. రావాల్సిన డబ్బులు అందకుండాపోయే అవకాశాలున్నాయి. వివాహ జీవితం, ఆరోగ్యం బాగుంటుంది. అయితే, మానసికంగా అష్టత ఉంటుంది.
జులై నెలలో మిథున రాశి వారికి సంబంధాలు మెరుగుపడడంతో పాటు కెరియర్లో కలిసి వస్తుంది. వైవాహిక జీవితంలో కొనసాగుతున్న ఇబ్బందులు పరిష్కారమవుతాయి. వైవాహిక జీవితం మెరుగవుతుంది. వ్యాపారవేత్తలు పెట్టుబడుల నుంచి మంచి ప్రయోజనాలుంటాయి. విదేశీ ప్రయాణాలకు అవకాశం ఉంది. కొత్త ఆదాయం వనరులు అందుబాటులోకి వస్తాయి. ప్రణాళికను అనుకున్న విధంగా పూర్తి చేసే సూచనలున్నాయి.
ఈ నెల కన్య రాశి వారికి అదృష్టం కలిసివస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. పనిచేసే చోట అభినందలు అందుకుంటారు. విద్యార్థులు చదువులలో, ముఖ్యంగా పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. ఇల్లు, ఆస్తిని కొనుగోలు చేసే ప్రణాళికలు నెరవేరే అవకాశాలున్నాయి. వ్యాపారవేత్తలు లాభం పొందుతారు. ఉద్యోగులు తమ లక్ష్యాలల్లో విజయం సాధిస్తారు.
జూలై నెల వృశ్చిక రాశి వారికి పురోగతి ఉంటుంది. కృషి, అంకితభావంతో, ఉద్యోగం చేస్తున్న చోట ఉన్నత స్థానం పొందే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది. పెట్టుబడులు పెట్టిన వారికి లాభాలు వస్తాయి. వ్యాపార విస్తరణ సాధ్యమవుతుంది. కుటుంబ సంబంధాలు మెరుగవుతాయి. అయితే ఆర్థిక సంబంధాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ సమయంలో పాత సమస్యలకు పరిష్కారం దొరికే సూచనలు కనిపిస్తున్నాయి.
జులైలో కుంభరాశి వారు ప్రతిరంగంలో సానుకూల ఫలితాలు పొందుతారు. వైవాహిక జీవితంలో సామరస్యం వెల్లివిరుస్తుంది. వ్యాపారరంగంలో కష్టపడి పని చేసేవారికి మంచి ఫలితాలుంటాయి. విదేశాలకు సంబంధించిన విషయాలలో అనుకూలమైన ఫలితాలను పొందే అవకాశం ఉంది. కీర్తి పెరుగుతుంది. ఉన్నత చదువులు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది. మానసిక ఏకాగ్రత చెక్కుచెదరకుండా ఉంటుంది.
“Lord Shiva | ఈ మూడు రాశులవారిపై పరమేశ్వరుడి అనుగ్రహం.. ఆ రాశులేంటో తెలుసా..?”
“July Horoscope | జులైలో మారనున్న గ్రహాలు.. ఈ మూడురాశుల వారికి డబ్బే డబ్బు.. ప్రమోషన్లు కూడా..!”