Lord Shiva | హిందూ సంప్రదాయంలో శివుడికి చాలా ప్రత్యేక స్థానం ఉన్నది. ఆయనను సృష్టి, స్థితి, లయకారకుడిగా పేర్కొంటారు. మహాదేవుడి ఆరాధనతో భక్తుల కష్టాలు తొలగి, కుటుంబంలో ఆనందం, ఐశ్వర్యం వెల్లివిరుస్తాయి. జీవితంలోని కష్టకాలంలో పరమేశ్వరుడి నామాన్ని తలచినా భయం తొలగిపోయి మనసుకు శాంతి కలుగుతుంది. చంద్రుడిని శివుడు తన తలపై ధరిస్తాడు. జ్యోతిషశాస్త్రంలో చంద్రుడికి ప్రత్యేక స్థానం ఉంది. చంద్రుడు మనస్సు, మానసిక ప్రశాంతత, భావోద్వేగాల సూచికగా పేర్కొంటారు.
శివుడి అనుగ్రహం జాతకంలో ఉంటే ఆ వ్యక్తి దయగలవాడిగా, మానసికంగా బలంగా ఉంటాడు. శివుడు కర్కాటక రాశికి అధిపతి కావడంతో ఆ రాశి వారిపై ఆయన కృప ఎప్పుడూ ఉంటుంది. అయితే, కేవలం కర్కాటకరాశి మాత్రమే కాదు.. మహాశివుడు మరికొన్ని రాశుల మీద ప్రత్యేకంగా కరుణ చూపిస్తాడని జ్యోతిష పండితులు పేర్కొంటున్నారు. ఆయన అనుగ్రహం వల్ల కెరీర్, వ్యాపారం, ప్రేమ, సంపదతో పాటు అనేక రకాలుగా మేలు జరుగుతుందని పేర్కొంటున్నారు. మరి అదృష్టరాశులవారెవరో చూద్దాం..!
రాశిచక్రంలో తొలిరాశి అయిన మేషంపై శివుడితో పాటు హనుమంతుడి అనుగ్రహం ఉంటుంది. మహాదేవుడి కృపతో వీరు కెరీర్లో ముందుకు వెళ్తారు. వ్యాపారంలో పేరు ప్రఖ్యాతలు సాధిస్తారు. ప్రేమ జీవితంలో విజయవంతమవుతారు. అంతేకాకుండా మేషరాశి వారు భయపడే స్వభావంతో ఉండరు. ఏ పరిస్థితుల్లోనైనా ధైర్యంగా పోరాడుతారు. శివుడి ఆశీర్వాదంతో జనాలను ఆకట్టుకుంటారు. అందరితో ప్రేమగా ఉంటారు. ఎక్కడెళ్లినా స్వతంత్ర గుర్తింపును సాధిస్తారు. ఈ రాశివారు ప్రతిసోమవారం “ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనంష అనే మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తే జీవితంలో సంతోషం నిలిచి ఉంటుంది.
ఈ రాశికి అధిపతి చంద్రుడు. దాంతో ఈ రాశివారిపై సైతం శివుడి అనుగ్రహం ఉంటుంది. ఈ రాశి వారు ఎలాంటి సమస్యలో పడినా పరమేశ్వరుడు వారికి రక్షణ కల్పిస్తాడు. ఆయన అనుగ్రహం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. అప్పుల బాధ నుంచి బయటపడుతారు. అనారోగ్యం దూరమవుతుంది. వీరికి వాహనం ఎక్కువగా ఉంటుంది. సంపార జీవితం ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపారంలో ధనలాభం ఉంటుంది. రోజూ శివలింగాన్ని జలంతో అభిషేకిస్తే శివ కుటుంబం ఆశీర్వాదం ఉంటుందని పండితులు పేర్కొంటున్నారు.
మకరరాశికి అధిపతి శనైశ్చరుడు. శివుడిని శనీశ్వరుడు తన ఆరాధ్య దేవుడిగా భావిస్తాడు. అందువల్ల మకరరాశి వారిపై శివుడి అనుగ్రహం సర్వదా ఉంటుంది. ఈ రాశి వారు తమ కృషితో కెరీర్లో మంచి పేరు తెచ్చుకుంటారు. ఎక్కడెళ్లినా ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదిస్తారు. ప్రేమ జీవితం ఆనందంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు కూడా శివుని కృప వల్ల తగ్గుతాయి. సోమవారం రోజున బిల్వదళాలను శివునికి అర్పిస్తే ధన సంబంధమైన సమస్యలు పరిష్కరమవుతాయని పండితులు పేర్కొంటున్నారు.
Read Also :