Evil Eye Effect on Zodiac Signs | నరదృష్టికి నాపరాయి సైతం పగులుతుందనేది సామెత. ఎవరిపైనైనా ఈ ప్రభావం ఉంటుంది. మంచి మనసు, ఆలోచనలతో ఉన్న వ్యక్తుల చూపు నుంచి వచ్చే పాజిటివ్ వైబ్రేషన్స్‌తో ఎలాంటి దోషం ఉండదు. కానీ, మనసులో ఏదైనా చెడు ఆలోచనలు, ద్వేషంతో చూస్తే మాత్రం ఆ చూపుల నుంచి వచ్చే వైబ్రేషన్స్ కారణంగా ఇబ్బందులు కలుగుతాయి. దాన్నే నరదృష్టి అని పిలుస్తారు. నరదృష్టిని బారి నుంచి తప్పించుకునేందుకు చాలామంది పూజలు చేస్తూ వస్తుంటారు. అయితే, కొన్నిరాశుల వ్యక్తులు సున్నితత్వం, ఆకర్షణ కారణంగా వారు నరదృష్టికి ఎక్కువ ప్రభావితమవుతారు. ఈ వ్యక్తులు వారి సహజత్వం, స్వభావం కారణంగా త్వరగానే ప్రతికూల శక్తుల బారినపడుతుంటారు. దాంతో వారి జీవితంలో నిరంతరం అడ్డంకులు, సంఘర్షణలు ఎదుర్కొంటారు. ఈ పరిస్థితుల్లో ప్రతికూల ప్రభావం నుంచి తమను తాము కాపాడుకునేందుకు ప్రత్యేక జాగ్రత్తలతో పాటు రక్షణ చర్యలు తీసుకోవాలి. ఏ రాశుల వారిపై ఎక్కువ నరదృష్టి పడుతుంది? వారు పాటించాల్సిన పరిహారాలు ఏంటో తెలుసుకుందాం..!
మిథున రాశి జాతకులు స్వభావం రీత్యా చాలా భావోద్వేగ, సున్నితమైన మనస్కులు. వారిలో సహజత్వం, ఏది రహస్యంగా ఉంచే అలవాటు లేకపోవడం వల్ల చాలా మందికి త్వరగా దగ్గరవుతారు. కానీ, దాంతో ఇతరుల అసూయ, ప్రతికూల శక్తికి బాధితులుగా మారిపోతారు. వారిపై నరదృష్టి పడితే ఆందోళన, ఒత్తిడి, మానసిక స్థితిలో మార్పులు వంట సమస్యలను ఎదుర్కొంటారు. కొన్నిసార్లు వారి శక్తి బలహీనమవుతుంది. దాంతో వారు పని చేసేందుకు సైతం ఇష్టపడరు.
పాటించాల్సిన పరిహారాలు : మిథున రాశి వారు ప్రతిరోజూ తులసి మొక్కను జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంట్లో తులసి ఆకులను ఉంచుకోవాలి. హనుమాన్ చాలీసాను క్రమం తప్పకుండా పఠించడం వారి మానసిక ప్రశాంత చేకూరి ప్రశాంతంగా ఉంటారు. అలాగే, నల్ల నువ్వులను దానం చేయడం, దీపంలో నల్ల నువ్వులను కాల్చడం వల్ల ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయి.
కర్కాటక రాశివారు చూసేందుకు కఠినంగా కనిపిస్తారు. కానీ, వారు సున్నిత మనసు ఉంటుంది. భావోద్వేగానికి లోనవుతారు. వారి ఆప్యాయత జనాలను ఆకర్షిస్తుంది. దాంతో అసూయ, నరదృష్టి బారినపడుతారు. దాంతో మానసిక పరిస్థితి అస్థిరమవుతుంది. భావోద్వేగానికి గురవుతారు. దాంతో ఆత్మవిశ్వాసం తగ్గుతుంది.
పరిహారం: ఇంట్లో వేప ఆకులను ఉంచడం కర్కాటక రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. క్రమం తప్పకుండా దైవారాధన చేస్తుండాలి. ముఖ్యంగా శనిదేవుడి ఆరాధన ఉపశమనం కలిగిస్తుంది. నలుపు రంగు వస్తువులను ధరించడం, ఇంట్లో ఉంచడం వల్ల నరదృష్టి ప్రభావం తగ్గుతుంది.
కన్య రాశి వారు తెలివైనవారు. మంచి మనసుగలవారు. వారిలో విశ్లేషణాత్మక సామర్థ్యం ఉంటుంది. కానీ, వారికి అతిగా ఆలోచించడం, ఆందోళన చెందడం అలవాట్లు వారిని మానసికంగా కలవరానికి గురి చేస్తుంటాయి. దాంతో వారు త్వరగా నిరుత్సాహానికి గురవుతారు. వారిపై నరదృష్టి బాగా ఉంటుంది. దాంతో అశాంతి. నిద్రలేమి, శారీరక బలహీనత తదితర సమస్యల బారినపడుతుంటారు.
పరిహారం: కన్య రాశి వారు ప్రతిరోజూ గాయత్రీ మంత్రాన్ని జపించాలి. నల్ల నువ్వులను కాల్చాలి. నిమ్మ-మిరపకాయలతో దృష్టి నివారణ చేయడం కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దాంతో పాటు పసుపు, కర్పూరం మిశ్రమాన్ని కాల్చి ఇంట్లో ఉంచడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోతుంది.
తులారాశి వారు వినయం, సౌమ్యత, సమతుల్య ప్రవర్తనతో పేరు తెచ్చుకుంటారు. కానీ, వారి ఈ లక్షణం కొన్నిసార్లు ఇతరుల అసూయకు కారణమవుతుంది. వారు నరదృష్టి బారినపడితే భావోద్వేగపరంగా అస్థిరంగా ఉంటారు. అలసిపోతారు, చిరాకు పెరుగుతుంది.
పరిహారం: తులారాశి వారు హనుమాన్ ఆలయానికి వెళ్లి క్రమం తప్పకుండా పూజలు చేయాలి. మీ దుస్తులలో లేదా నల్లబట్టలో నువ్వులను కట్టి పెట్టుకోవడం మంచిది. ఇంట్లో కర్పూరం కాల్చడం, సానుకూల ఆలోచనలు చేస్తే ప్రతికూల ప్రభావాల నుంచి బయటపడుతారు.
మీనరాశి చాలా సున్నితమైన వ్యక్తులు. ఊహాత్మకంగా, ఆధ్యాత్మికంగా ఉంటారు. వారి లోతైన అవగాహన, భావోద్వేగం ఇతరుల ప్రతికూల శక్తికి సులభంగా ప్రభావితమయ్యేలా చేస్తుంది. వారు భావోద్వేగపరంగా అస్థిరంగా ఉంటారు. నరదృష్టి పడితే వారి శక్తి క్షీణిస్తుంది.
పరిహారం: మీన రాశి వారు ప్రతిరోజూ దైవారాధన చేయాలి. ముఖ్యంగా నీరు, దీపం, పువ్వులకు సంబంధించిన ఆచారాలు చేయాలి. తులసి, వేప మొక్కను నాటడంతో పాటు దానిని జాగ్రత్తగా చూసుకోవడం చాలా శుభప్రదం. సానుకూల శక్తి కోసం ధ్యానం, యోగా సాధన చేయాలి.