July Horoscope | జూన్ మాసం ముగిసి.. జులై మాసం మొదలుకానున్నది. జ్యోతిషశాస్త్రం ప్రకారం.. జులై చాలా ప్రత్యేకం. ఈ నెలలో మహాదేవుడికి ప్రీతికరమైన శ్రాణమాసం ప్రారంభం కానున్నది. అదే సమయంలో అనేక గ్రహాలు తమస్థానాలను మార్చుకుంటాయి. జులైలో గ్రహాలకు రాజైన సూర్యుడు కర్కాటకంలో సంచరించనున్నాడు. దాంతో పాటు పునర్వసు, పుష్య నక్షత్రంలో ఉంటాడు. జులై 28 వరకు కుజుడు సింహరాశిలో ఉంటాడు. జులై 23న కుజుడు తన రాశిని మార్చుకోనున్నాడు. ఇది 12 రాశిచక్రాలను సైతం ప్రభావితం చేయనున్నది. శుక్రుడు సైతం జులైలో తన రాశిని మార్చుకోనున్నాడు. వృషభం నుంచి మిథునరాశిలోకి మారనున్నాడు. అదే సమయంలో న్యాయదేవుడు శనైశ్చరుడు జులై 13న మీనరాశిలో ఉంటూ.. అదే రాశిచక్రంలో తిరోగమనంలో ఉంటాడు. గ్రహ సంచారంతో కొన్ని రాశుల వారికి లాభం జరుగనున్నది. ఈ వ్యక్తులు ప్రతి రంగంలోనూ ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. కెరీర్లో విజయాలను అందుకోనున్నారు. ఈ ఆ రాశుల్లో మీ రాశులు ఉన్నాయో చెక్ చేసుకోండి..!
వృషభరాశి పాలకగ్రహం శుక్రుడు. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు ప్రేమ, అందం, ఐశ్వర్యం, శ్రేయస్సులకు కారకుడు. వృషభ రాశి వారి వ్యక్తిత్వంలో ఈ లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా సున్నితమైనవారు, సౌందర్య ప్రియులు, శృంగారభరితంగా ఉంటారు. గ్రహాల సంచారంతో జులైలో వృషభరాశి వ్యక్తులు పనిచేసే చోట విజయం సాధిస్తారు. మీరు ప్రభుత్వం ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నట్లయితే శుభవార్త అందుకునే అవకాశాలున్నాయి. పూర్వీకుల ఆస్తిలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. పెట్టుబడుల ద్వారా డబ్బు సంపాదిస్తారు. ఈ నెల వ్యాపారంలో గణనీయమైన పురోగతి సాధిస్తారు. లాభాలతో మార్కెట్లో విశ్వసనీయత పెరుగుతుంది. ప్రతి రంగంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సంబంధాలు మునుపటి కంటే మెరుగ్గా ఉంటాయి. మీ జీవిత భాగస్వామి నుంచి ఆశ్చర్యకరమైన బహుమతి అందుకుంటారు. ఓ వైపు కెరియర్, వ్యాపారాల్లో మంచి అవకాశాలు దక్కుతాయి.
మిథున రాశి పాలక గ్రహం బుధుడు. మిథున రాశికి అధిపతి బుధుడు, ఈ రాశి లక్షణాలపై బుధుడి ప్రభావం ఉంటుంది. తెలివితేటలు, కమ్యూనికేషన్, సామాజికతకు కారకంగా పేర్కొంటున్నారు. జిజ్ఞాస, బహుముఖ ప్రజ్ఞశీలురు. మిథున రాశి వ్యక్తులు చురుకైనవారు. ఉత్సాహవంతులు. కొత్త విషయాలను నేర్చుకోవడానికి, వివిధ వ్యక్తులతో కలవడానికి ఇష్టపడతారు. జూలై నెల మిథున రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. వివాహం కాని యువతీ యువకులకు వివాహం నిశ్చయమయ్యే అవకాశం ఉంది. వ్యాపారరంగంలో ఉన్న వారికి ఈ సమయం మధ్యస్తంగా లాభదాయకంగా ఉంటుంది. మార్కెట్లో వృద్ధిని సద్వినియోగం చేసుకోవడంలో విజయం సాధిస్తారు. ఈ నెలలో, భూమి, వాహనం, ఆస్తికి సంబంధించిన విషయాల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగులకు డబ్బు చేతికి అందుతుంది. డబ్బులు ఆదా చేసేందుకు ప్రాధాన్యం ఇస్తారు. ధైర్యం పెరుగుతుంది.
కన్యారాశి పాలకగ్రహం బుధుడు. బుధుడు కమ్యూనికేషన్, తెలివితేటలు, సమాచార ప్రాసెసింగ్‌కు సంబంధించిన గ్రహం. కన్యారాశి వ్యక్తులు తరచుగా విశ్లేషణాత్మక నైపుణ్యాలు, ఖచ్చితత్వం, సమస్య పరిష్కారంలో రాణిస్తారు. కన్య రాశి వారికి పెట్టుబడుల నుంచి చాలా లాభం లభిస్తుంది. కెరీర్, వ్యాపారంలో పురోగతి, లాభం ఉంటుంది. జీవితంలో సంతోషకరమైన క్షణాలను పొందుతారు. మీ కెరీర్లో మీరు కోరుకున్న విజయంతో పాటు శుభవార్తలను వింటారు. కొత్త ప్రదేశాల నుంచి ప్రయోజనాలను పొందే అవకాశాలున్నాయి. ప్రేమ భాగస్వాములు, జీవిత భాగస్వామితో మంచి సాన్నిహిత్యం కొనసాగిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుతుంది.
Read Also :