Retrograde Planets July | జ్యోతిషశాస్త్రం ప్రకారం.. సూర్యుడు, చంద్రుడు ఎప్పుడూ తిరోగమణంలో ఉండరు. అయితే, రాహువు, కేతువు ఎప్పుడూ తిరుగోమనంలో ఉంటారు. అన్ని ఇతర గ్రహాల ఎప్పటికప్పుడు వాటి వేగాన్ని తగ్గించి తిరోగమన స్థితిలోకి వెళతాయి. ఈ పరిస్థితుల్లో గ్రహం శక్తి సాధారణం కంటే తీవ్రంగా మారుతుంది. కానీ, గ్రహం స్వయంగా ఆ శక్తిని నియంత్రించలేకపోతుంది. అందువల్ల తిరోగమన గ్రహం కదలిక అస్థిరంగా మారుతుంది. దాని ప్రభావాలు ఖచ్చితంగా అంచనా వేయడం కష్టమవుతుంది. జ్యోతిషశాస్త్రంలో.. శుభ ఫలితాలను ఇవ్వడానికి బదులుగా తిరోగమన గ్రహాలు ఎక్కువగా ప్రతికూల ఫలితాలు ఇచ్చే అవకాశం ఉన్నాయి. దీనికి కారణం వాటికి శక్తి అనియంత్రితంగా ఉంటుంది. ఇది ప్రతికూల ప్రభావాల ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ సమయంలో గ్రహాల ప్రభావాల నుంచి జాగ్రత్త తీసుకోవాలి. పెద్ద నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి. తద్వారా అవాంఛిత సమస్యలను నివారించేందుకు అవకాశం ఉంది.
జూలై 2025లో మూడు ప్రధాన గ్రహాలు శని, బుధుడు, నెప్ట్యూన్ తిరోగమన స్థితిలోకి ప్రవేశిస్తాయి. ఇది అన్ని రాశులపై విభిన్న ప్రభావాలు చూపనున్నాయి. జులై 13న ఉదయం 9.36 గంటల నుంచి నవంబర్ 28 వరకు దాదాపు 138 రోజులు శని తిరోగమనంలో ఉంటాడు. పురోగతి, అడ్డంకులు, సహనానికి పరీక్షా సమయం మారనున్నది. జూలై 18న రాత్రి 10.13 గంటల నుంచి ఆగస్టు 11 వరకు దాదాపు 25 రోజులు బుధుడు తిరోగమనంలో ఉంటాడు. దీని కారణంగా కమ్యూనికేషన్ అంతరాయాలు, అపార్థాలు, ఆలోచనల్లో గందరగోళం ఏర్పడుతుంది. జూలై 5న మధ్యాహ్నం 2.58 గంటల నుంచి డిసెంబర్ 10 వరకు దాదాపు 159 రోజులు నెప్ట్యూన్ తిరోగమనంలో ఉండనున్నాడు. ఇది మానసిక గందరగోళం, భావోద్వేగ అస్థిరత, జీవితంలో అనిశ్చితి పెరుగుతుంది.
ఈ సమయంలో పని చేసే చోట గందరగోళ పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. శని ప్రభావం కారణంగా ప్రణాళికలు సకాలంలో పూర్తయ్యేందుకు అవకాశం లేదు. పనులు ఆలస్యమే అవకాశాలున్నాయి. బుధుడు తిరోగమనంలో ఉండటం వల్ల ఏదైనా మాట్లాడే సమయంలో ఎదుటివారు అపార్థం చేసుకునే అవకాశం ఉంది. సంబంధాలను దెబ్బతీసే అవకాశాలున్నాయి. నెప్ట్యూన్ ప్రభావంతో మానసిక ఒత్తిడి, గందరగోళ పరిస్థితులు పెరుగుతాయి. ధ్యానం, శాంతియుత కార్యకలాపాలతో ప్రయోజనకరంగా ఉంటాయి.
ఉన్నత విద్య, విదేశీ ప్రయాణం, చట్టపరమైన విషయాల్లో అడ్డంకులు ఎదురయ్యే అవకాశాలున్నాయి. ముఖ్యంగా పెట్టుబడి, భవిష్యత్తు ప్రణాళికల విషయాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం మంచిది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఉంటుంది. అంతర్గత శాంతిని ఇస్తుంది. గత అనుభవాల నుంచి పాఠకులు నేర్చుకుని ముందుకు సాగండి. ఆర్థిక విషయాలలో అజాగ్రత్తగా ఉండకండి. బడ్జెట్‌పై నియంత్రణ అవసరం.
ఆర్థిక విషయాలు, భాగస్వాముల్లో జాగ్రత్తగా చాలా ముఖ్యం. ఈ సమయంలో ఎవరినైనా గుడ్డిగా నమ్మడం ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. తిరోగమన గ్రహాల ప్రభావం, మోసం లేదంటే నష్టానికి దారి తీసే అవకాశాలున్నాయి. మానసిక ఒత్తిడిని నివారించడానికి.. మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోవడం ముఖ్యం. క్రమం తప్పకుండా యోగా చేయాలి. కీలకమైన పత్రాలు, ఒప్పందాలను జాగ్రత్తగా చూసుకోవడం అవసరం.
వైవాహిక జీవితం, భాగస్వామ్య సంబంధాల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయి. కమ్యూనికేషన్ లేకపోవడం, అపార్థాల కారణంగా వివాదాల బారినపడే అవకాశాలున్నాయి. కార్యాలయంలో సహోద్యోగులతో సమన్వయంతో ముందుకు వెళ్లాలి. నెప్ట్యూన్ ప్రభావం కారణంగా మనస్సు గందరగోళంలో ఉండవచ్చు. సంబంధాల్లో పారదర్శకత, సహనం ద్వారా మాత్రమే సమస్యలను పరిష్కరించుకునే అవకాశం ఉంది.
సింహరాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పాత వ్యాధులు తిరిగబెట్టే అవకాశం ఉంది. పనిచేసే చోట ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయి. మనసులో నిరాశ ఉంటుంది. ఓపికగా ఉండి మళ్లీ సిద్ధం కావాల్సిన సమయం ఇది. ప్రస్తుతానికి కొత్తగా చేపట్టాల్సిన పనులు వాయిదా వేసుకోవడం మంచిది. మీ జీవనశైలిని మెరుగుపరచుకోవాలి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది.
ప్రేమ సంబంధాల్లో ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశాలున్నాయి. అపార్థాలు పెరిగే అవకాశం ఉంది. మీరు సృజనాత్మకత రంగంలో ఉన్న ఆరు.. పనిలో జాప్యం, అడ్డంకులు ఎదురయ్యే అవకాశాలున్నాయి. పిల్లలకు సంబంధించిన ఆందోళనలు పెరిగే అవకాశాలున్నాయి. నెప్ట్యూన్ తిరోగమన కదలిక భావోద్వేగ అస్థిరతను పెంచుతుంది. సంయమనం, ఆలోచనతో తీసుకున్న నిర్ణయాలు మాత్రమే ప్రయోజనం చేకూరుస్తాయి.
కుటుంబంలో ఉద్రిక్తత ఎదురయ్యే అవకాశం ఉంది. అలాగే, పాత వివాదాలు సైతం తలెత్తే అవకాశం ఉంది. ఆస్తి, గృహ విషయాల్లో గందరగోళ పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. కుటుంబంతో కూర్చుని మాట్లాడుకుంటే పరిస్థితులు సద్దుమణిగే అవకాశం ఉంది. ఇంటి వాతావరణాన్ని ప్రశాంతంగా, సానుకూలంగా మారే అవకాశం ఉంటుంది. ప్రతికూల ఆలోచనలను నివారించాలి. అందరితో మర్యాదపూర్వకంగా మెదలడం మంచిది.
ప్రయాణాల్లో అడ్డంకులు ఎదురయ్యే అవకాశాలున్నాయి. సాంకేతిక విషయాల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. తోబుట్టువులతో విభేదాలు ఎదురయ్యే సూచనలున్నాయి. జాగ్రత్తగా మాట్లాడాలి. మీడియాతో సంబంధం ఉన్న వ్యక్తులు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. నెప్ట్యూన్ కారణంగా గందరగోళ పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది. దాంతో నిర్ణయాలు తీసుకోవడం కష్టమవుతుంది. ఏవైనా పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించడం ముఖ్యం.
ఆర్థిక విషయాల్లో ఒడిదుడుకులు ఉంటాయి. పాత రుణాలు, ఖర్చులు ఇబ్బంది పెట్టే అవకాశాలున్నాయి. మీ ఆదాయం, ఖర్చులను సమీక్షించాల్సిన సమయం ఇది. పెట్టుబడుల విషయంలో తొందరపాటు మంచిదికాదు. సరైన సలహాలు సూచనలు తీసుకోవాలి. ఎవరికీ గుడ్డిగా నమ్మకుండా ఆత్మ పరిశీలన చేసుకొని సరైన దిశలో ప్రయణించాలి.
శని, బుధుడు, నెప్ట్యూన్ గ్రహాలు మీ జతకాన్ని ప్రభావితం చేయనున్నాయి. ఈ కారణంగా మీరు జీవితంలోని అనేక అంశాలు నెమ్మదించినట్లుగా అనిపిస్తుంది. కెరియర్, ఆరోగ్య సంబంధిత విషయాల్లో సమతుల్యత చూసుకోవాలి. మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడానికి, జీవితం గురించి లోతుగా ఆలోచించుకునేందుకు ఇదే సరైన సమయం. ఏ నిర్ణయం తీసుకున్నా తొందరపాటు మంచిది కాదు. ఆత్మ పరిశీలన చేసుకొని క్రమశిక్షణ పాటించాలి.
గత విషయాలు, ఎటూ తేలకుండా మిగిలి పోయిన సమస్యల గురించి మళ్లీ మీ మనసులో ఆలోచనలు వస్తాయి. మానసికంగా గందరగోళానికి గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ఆత్మపరిశీలన.. అంతర్ముఖంగా మీ గురించి తెలుసుకోవాలి. శత్రువులతో ఇబ్బందులు.. పాత సమస్యలు పునరావృతమయ్యే అవకాశాలున్నాయి. అప్రమత్తంగా ఉండాలి. ధ్యానం సాధన చేస్తూ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం మంచిది.
స్నేహితులతో గందరగోళ పరిస్థితులు ఏర్పడే అవకాశాలున్నాయి. నెప్ట్యూన్ తిరోగమనం కారణంగా ఆలోచనల్లో గందరగోళానికి గురి చేస్తుంది. ప్రణాళికలు వేసినా ముందుకు సాగేందుకు సమయం పడుతుంది. ఓపికగా ఉండాలి. మీరు విజయం సాధిస్తారు. మీ కలలను నిజం చేసుకునేందుకు ఆచరణాత్మక విధానాన్ని అనుసరించాలి.