తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సమయానికి డబ్బు చేతికి అందుతుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. అయితే అనుకోని ఖర్చులు ముందుకు రావచ్చు. ఉద్యోగులకు కార్యాలయంలో అనుకూల వాతావరణం ఉంటుంది. బాధ్యతతో పనులు చేస్తారు. వ్యాపారులకు భాగస్వాములతో సంబంధాలు మెరుగవుతాయి. విద్యార్థులకు మంచి సమయం. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు ముందుకు కొనసాగుతాయి. వాహనం, భూముల వల్ల ఖర్చులు రావచ్చు.
కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. పదోన్నతి లభించవచ్చు. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. ఉద్యోగులకు తోటివారి సహకారం లభిస్తుంది. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. శ్రమకు తగిన ఫలితం పొందుతారు. కోర్టు కేసులలో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. పారిశ్రామికవేత్తలకు రాబడి స్థిరంగా ఉంటుంది. ఉత్సాహంతో కొత్త పనులు ప్రారంభించే ఆలోచన చేస్తారు. విద్యార్థులు ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ముందుకు సాగుతాయి.
ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. సంయమనం అవసరం. ఖర్చులు తగ్గించుకోవాలి. పెద్దల సహకారం లభిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. రాజకీయ, ప్రభుత్వ పనులలో జాప్యం ఉండవచ్చు. కోర్టు పనులు కలిసివస్తాయి. ఆదాయంలో అస్థిరత కారణంగా అసంతృప్తి కలుగుతుంది. వివాదాల జోలికి వెళ్లకండి. విద్యార్థులకు శ్రమ పెరగవచ్చు. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.
ప్రయాణాలు కలిసివస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. సహోద్యోగుల సహకారం ఉంటుంది. పై అధికారులతో సత్సంబంధాలు ఉంటాయి. ఆత్మీయుల సహకారంతో వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్తగా పరిచయం అయినవారితో జాగ్రత్త అవసరం. పలుకుబడి పెరుగుతుంది. గృహ నిర్మాణ పనులపై మనసు నిలుపుతారు. ఆరోగ్యంగా ఉంటారు. వ్యాపారులు భాగస్వాములతో సామరస్యంగా వ్యవహరించాలి. కళాకారులకు అనుకూల వాతావరణం.
స్నేహితులు, బంధువులతో పనులు నెరవేరుతాయి. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. పాత బాకీలు వసూలు అవుతాయి. ఇంటా బయటా సంతృప్తికర వాతావరణం ఉంటుంది. ఉత్సాహంతో పనులుచేస్తారు. తీర్థయాత్రలు, దూర ప్రయాణాలపై మనసు నిలుపుతారు. ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది. ఆస్తుల విషయంలో ఉన్న తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. కొత్త పరిచయాలతో కార్యసాఫల్యం ఉంటుంది.
ఈ వారం కార్యసాఫల్యం ఉంది. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహ నిర్మాణం చేపడతారు. స్నేహితులు, బంధువర్గంతో పనులు కలిసివస్తాయి. వాహనం, భూముల విషయంలో జాగ్రత్తతో వ్యవహరించడం మంచిది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. కొత్త పనులు చేయడంపై మనసు నిలుపుతారు. రాజకీయ, ప్రభుత్వ, కోర్టు పనుల మూలంగా ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగులకు ఆదరణ లభిస్తుంది. ఏకాగ్రత, పట్టుదలతో పనులు పూర్తిచేస్తారు. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. పారిశ్రామికవేత్తలకు న్యాయపరమైన చిక్కులు తొలగిపోతాయి. రాబడి స్థిరంగా ఉంటుంది.
ఈ వారం ఖర్చులు పెరగవచ్చు. నియంత్రణ అవసరం. శుభకార్య ప్రయత్నాలు నలుగురి సహకారంతో కొనసాగుతాయి. ఆదాయంపై శ్రద్ధ వహించండి. ఉద్యోగులకు కార్యాలయంలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. వివాదాలకు దూరంగా ఉంటూ, పనులపై మనసు నిలపడం మంచిది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. వ్యాపారంలో అసంబద్ధ నిర్ణయాల మూలంగా ఖర్చు పెరగవచ్చు. ఆత్మీయుల సలహాతో కొన్ని పనులు నెరవేరుతాయి. శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. ప్రయాణాలు వాయిదా పడతాయి.
ఆత్మీయుల సహకారం లభిస్తుంది. కొత్త పరిచయాలతో కార్యసాఫల్యం ఉంటుంది. భూములు, వాహనాల విషయంలో ఖర్చులు పెరుగుతాయి. జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. గతంలో పెట్టిన పెట్టుబడులలో ప్రతిఫలాన్ని పొందుతారు. జీవిత భాగస్వామితో సంతోషంగా కాలం గడుపుతారు. ఉద్యోగులకు తోటివారి సహకారం లభిస్తుంది. అధికారులతో స్నేహంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. పదోన్నతి మూలంగా స్థాన చలనం ఉండవచ్చు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది.
నలుగురి సహకారంతో తలచిన పనులు పూర్తవుతాయి. వివాహాది శుభకార్యాలు చేస్తారు. పెద్దల సూచనలను పాటించండి. విద్యార్థులకు కలిసి వస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. కొత్త ఉద్యోగంలో చేరవచ్చు. బరువు, బాధ్యతలు పెరుగుతాయి. పనులను సంతోషంగా స్వీకరించి, సమర్థవంతంగా పూర్తి చేస్తారు. కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు పొందుతారు. బంధువర్గం సహకారం లభిస్తుంది. వ్యవసాయదారులకు అనుకూల వాతావరణం. వ్యాపారులు కొత్త పెట్టుబడులపై దృష్టి నిలుపుతారు.
శాస్త్రవేత్తలు, విద్వాంసులకు అనుకూలం. కొత్త అవకాశాలతో ఆదాయం పెరుగుతుంది. కొత్త వస్తువులు, దుస్తులు కొనుగోలు చేస్తారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. సహోద్యోగుల సహకారం పొందుతారు. సమయానికి పనులను పూర్తిచేస్తారు. పై అధికారుల మెప్పు పొందుతారు. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఇరుగు పొరుగుతో సంబంధాలు మెరుగవుతాయి. ఆర్థికాంశాల్లో తొందరపాటు తగదు.
బంధుమిత్రుల సహకారంతో తలపెట్టిన పనులు పూర్తిచేస్తారు. పనుల్లో బరువు, బాధ్యతలు పెరుగుతాయి. సంయమనంతో వ్యవహరిస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. అన్ని విషయాలను చర్చించి, నిర్ణయాలు తీసుకుంటారు. ఏమైనా సమస్యలు వస్తే, వాదనకు దిగకుండా చర్చల ద్వారా పరిష్కరించుకోవడం మంచిది. బంధువర్గంతో సంబంధాలు మెరుగవుతాయి. విహారయాత్ర ఆలోచన చేస్తారు. వ్యాపార ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీలు గతంలో కన్నా కొంత అనుకూలం.
కొత్త ఉద్యోగంలో చేరుతారు. నలుగురిలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. స్నేహితులు, బంధువర్గంతో ఖర్చులు ఉండవచ్చు. కొత్తవారితో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. జీవన విధానాన్ని మార్చుకుంటారు. దైవిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కోర్టు ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారస్తులకు భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. ఇంటికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. నిలిచిపోయిన పనులలో కదలిక వస్తుంది.
Follow us