Ugadi Panchangam | శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో అధికమాసం వస్తున్నది. రెండు అమావాస్యల మధ్య రవి సంక్రమణం జరగని నెలను అధిక మాసంగా పరిగణిస్తారు. ఈ ఏడాది ఆషాఢ మాసంలో 17-7-2023 నాడు రాత్రి 12.01 గంటల వరకు అమావాస్య ఉన్నది. ఆదివారం తెల్లవారుజామున 5-06 గంటలకు రవి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. తర్వాతి అమావాస్య వరకూ అదే రాశిలో ఉంటాడు. ఈ కారణంగా ఈ ఏడాది శ్రావణం అధిక మాసంగా వస్తున్నది. అధిక మాసాన్ని పురుషోత్తమ మాసంగా పరిగణిస్తారు. అధిక మాసంలో దానధర్మాలు ఎంత ఎక్కువ చేస్తే అంత విశేషమని పెద్దల మాట. శక్తి మేరకు ఈ నెలలో బీదసాదలకు దానం చేయడం ద్వారా అధిక ఫలితం పొందుతారు.
మాస ఫలితం: శ్రావణం అధిక మాసంగా వచ్చిన సంవత్సరంలో దుర్భిక్షం, భూముల ధరలు తగ్గడం, ప్రజాక్షయం, ప్రజలు భయకంపితులు కావడం, ప్రజల్లో పాపభీతి నశించడం, హింస పెరగడం, పాలకులు ప్రజావ్యతిరేక చట్టాలు చేయడం, ఆహార కొరత, ధరల పెరుగుదల వంటి ఫలితాలు కలుగుతాయి.
నిత్యనైమిత్తిక కర్మలు, దానం, నిత్యాగ్ని హోత్రం, ఉపవాసం చేయవచ్చు.
ఎన్నడూ వెళ్లని క్షేత్ర సందర్శన, నామకరణ, అన్న ప్రాశనం,అక్షరాభ్యాసం, ఉపనయనం, వివాహాది శుభకార్యాలు, పాలకుల ప్రమాణ స్వీకారాలు, నూతన అనుష్ఠానాలు, ఉత్సవాలు, దేవతా ప్రతిష్ఠ, సర్వ ప్రాయశ్చిత్తాలు, ఆశ్రమ స్వీకారం చేయకూడదు.
| రాశి | రాజపూజ్యం | అవమానం | 
|---|---|---|
| మేషం | 3 | 1 | 
| వృషభం | 6 | 1 | 
| మిథునం | 2 | 4 | 
| కర్కాటకం | 5 | 4 | 
| సింహం | 1 | 7 | 
| కన్య | 4 | 7 | 
| తుల | 7 | 3 | 
| వృశ్చికం | 3 | 3 | 
| ధనుస్సు | 6 | 3 | 
| మకరం | 2 | 6 | 
| కుంభం | 5 | 6 | 
| మీనం | 1 | 2 | 
| రాశి | ఆదాయం | వ్యయం | 
|---|---|---|
| మేషం | 5 | 5 | 
| వృషభం | 14 | 11 | 
| మిథునం | 2 | 11 | 
| కర్కాటకం | 11 | 8 | 
| సింహం | 14 | 2 | 
| కన్య | 2 | 11 | 
| తుల | 14 | 11 | 
| వృశ్చికం | 5 | 5 | 
| ధనుస్సు | 8 | 11 | 
| మకరం | 11 | 5 | 
| కుంభం | 11 | 5 | 
| మీనం | 8 | 11 |