Venus Transit | శుక్రుడు మరికొద్ది గంటల్లో కన్యారాశిలోకి ప్రవేశించనున్నాడు. నేటి (అక్టోబర్ 9న) ఉదయం 10.38 గంటలకు కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. కన్యారాశిలో శుక్రుడు బలహీనంగా ఉండనున్నాడు. వేద జ్యోతిషశాస్త్రంలో శుక్రుడు ప్రేమ, అందం, భౌతిక సుఖాలు, సంపద, విలాసాలకు చెందిన గ్రహం. జాతకంలో శుక్రుడు బలంగా ఉంటే సంపద, సుఖాలు, విలాసాలు కొదవ ఉండదు. నేడు శుక్రుడు కన్యారాశిలోకి వెళ్లనున్నాడు. ఇప్పటికే సూర్యుడు కన్యారాశిలోనే ఉన్నాడు. దాంతో సూర్యుడితో కలిసి శుక్రుడు శుక్రాధిత్య యోగాన్ని ఏర్పరచనున్నాడు. కన్యారాశిలో శుక్రుడు, సూర్యుడి కలయిక శుక్రదిత్య యోగం ఏర్పడుతుంది. కన్యారాశిలోకి శుక్రుడు సంచారం కొన్ని రాశులవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం..!
మిథునరాశి ఐదవ, పన్నెండవ ఇంటిని శుక్రుడు పాలిస్తాడు. అక్టోబర్ 9న నాలుగో ఇంట్లో శుక్రుడు సంచరించనున్నాడు. నాల్గవ ఇంట్లో శుక్రుడు సంచారం శుభప్రదమైంది. మీకు అనుకూలంగా ఉంటుంది. రాబోయే రోజుల్లో సానుకూల ఫలితాలు చూస్తారు. శుక్రుడి సంచారం కారణంగా మీ కోరికలన్నీ నెరవేరే అవకాశం గోచరిస్తున్నది. అన్ని భౌతిక సుఖాలు, కోరికలు నెరవేరుతాయి. ఈ సమయంలో ఇతరుల నుంచి గౌరవాన్ని పొందుతారు. సంబంధాలు మరింత బలపడుతాయి.
శుక్రుడు సింహ రాశి మూడవ, పదో ఇళ్లను పాలిస్తాడు. అక్టోబర్ 9న శుక్రుడు రెండవ ఇంట్లో సంచారం జరుగబోతోంది. జాతకంలో రెండో ఇల్లు సంపద, వాక్కును సూచిస్తుంది. ఈ గ్రహసంచారం కారణంగా మీరు సంపద పెరగడంతో పాటు ఆస్తులు పెరుగుతాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వినోదరంగంలోని వారికి కొత్తగా అవకాశాలు వస్తాయి. రాబోయే కాలం కెరీర్‌కు అనుకూలంగా ఉంటుంది. మీరు మీ రంగంలో ఏదైనా సాధించే అవకాశం ఉంది.
శుక్రుడు కన్య రాశి రెండవ, తొమ్మిదో ఇండ్లను పాలిస్తాడు. జాతకంలో రెండవ ఇల్లు సంపదను సూచిస్తుంది. అయితే, తొమ్మిదవ ఇల్లు అదృష్టాన్ని సూచిస్తుంది. శుక్రుని సంచారం కన్యారాశి వారికి చాలా శుభప్రదంగా పేర్కొంటున్నారు. ఇది ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. మీకు అదృష్టాన్ని తెస్తుంది. కృషి, అదృష్టం ద్వారా గణనీయమైన మొత్తంలో డబ్బు సంపాదించడంలో విజయం సాధిస్తారు. అన్ని రకాల భౌతిక సుఖాలను అనుభవిస్తారు.
శుక్రుడు వృశ్చిక రాశి వారి ఏడవ, పన్నెండవ ఇళ్లకు అధిపతి. అక్టోబర్ 9న పదకొండవ ఇంట్లో శుక్రుడి సంచారం జరుగబోతున్నది. అంటే ప్రయోజనాలు అందించే ఇంట్లో శుక్రుడు ప్రవేశించనున్నాడు. శుక్రుడు ఈ ఇంట్లో సంచరిస్తున్నప్పుడు.. సానుకూల ఫలితాలు కలుగుతాయి. కెరీర్, వ్యాపారంలోనూ విజయం సాధిస్తారు. సంబంధాలు మరింత మధురంగా మారుతాయి.
Read Also :
“Mercury Transit | తులారాశిలోకి బుధుడు.. ఈ రాశులవారు పట్టిందల్లా బంగారమే..!”
“Kendra Yogam | రెండురోజుల్లో కేంద్ర యోగం.. ఇక ఈ మూడురాశుల వారి జాతకమే మారబోతోందిగా..!”