Gajkesari Raja Yogam | ఈ ఏడాది ప్రత్యేకమైన గజకేసరి రాజయోగం ఏర్పడనున్నది. ధనత్రయోదశికి ముందు ఈ యోగం.. మీ జీవితంలో ఆనందం, శ్రేయస్సును తీసుకురాబోతున్నది. బృహస్పతి ప్రస్తుతం మిథునరాశిలో ఉన్నాడు. ఈ నెల 12న చంద్రుడు సైతం మీనరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ సంయోగాన్నే గజకేసరి రాజయోగంగా పేర్కొంటారు. జ్యోతిషశాస్త్రంలో ఈ యోగం చాలా శుభప్రదమైంది. ఈ రాజయోగం ప్రభావం మానసిక ప్రశాంతత, ఉత్సాహాన్ని తీసుకురావడమే కాకుండా ఆర్థిక రంగంలో గణనీయమైన పురోగతిని తీసుకువస్తుంది. ఈ శుభ యోగం పలు రాశులకు ప్రయోజనం చేకూర్చనున్నది. కెరియర్, ఆర్థిక విషయాల్లో సానుకూల మార్పులు ఉంటాయి. గజకేసరి రాజయోగ ప్రభావం ఈ రాశులకు పురోగతికి సంబంధించి కొత్త మార్గాలను తెరుస్తుంది. ఊహించని ఆర్థిక లాభాలు ఉంటాయి. మనసంతా సంతోషం ఉంటుంది. జీవితంలో కొత్త ఉత్సాహం ఉంటుంది. రాజయోగం నుంచి ఏయే రాశులవారికి శుభయోగం చేకూర్చనున్నదో తెలుసుకుందాం..!
గజకేసరి రాజయోగం వృషభ రాశి వారికి అనేక సానుకూల మార్పులుంటాయి. మీ రాశి రెండో ఇంట్లో ఈ యోగం ఏర్పడబోతున్నది. దాంతో మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెరుగుతాయి. మీ ఆలోచనలు, భావాలను బాగా వ్యక్తపరచగలుగుతారు. వ్యక్తిగత, వృత్తిపరమైన రంగాల్లో సంబంధాలు బలోపేతమవుతాయి. ఈ సమయంలో నిలిచిపోయిన నిధులు తిరిగి చేతికందే అవకాశాలు ఉన్నాయి. దాంతో మీ ఆర్థిక పరిస్థితిని మెరుగవుతుంది. వ్యాపారం మార్కెటింగ్, మీడియా, బ్యాంకింగ్, స్టాక్ మార్కెట్లో ఉన్న వారికి ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రయోజనం ఉంటుంది. పెండింగ్లో పడ్డ ప్రాజెక్టులన్నీ పూర్తవుతాయి. కొత్త అవకాశాలకు వస్తాయి. ఉద్యోగులకు ఆకస్మికంగా ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. దాంతో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఈ సమయంలో ఆలోచనలు, ప్రణాళికలు విజయవంతమవుతాయి. ఈ కాలంలో డబ్బును ఆదా చేస్తారు. భవిష్యత్తుకు ఆర్థిక భద్రత ఉంటుంది. మొత్తానికి ఈ సమయం వృషభరాశికి ఆనందం, శ్రేయస్సును తీసుకువస్తుంది.
మిథునరాశికి గజకేసరి రాజయోగం చాలా శుభ అవకాశాలను తీసుకువస్తుంది. మీ జీవితంలో అనేక సానుకూల మార్పులు కలుగుతాయి. ఈ రాజయోగం మీ జాతకంలో లగ్నం ఇంట్లో ఏర్పడుతోంది. ఈ సమయంలో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ వ్యక్తిత్వం అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ సమయంలో తెలివితేటలు, ఆలోచనా సామర్థ్యాలు బాగుంటాయి. ఇది జీవితంలోని వివిధ రంగాల్లో విజయం సాధించడంలో మీకు సహాయపడుతుంది. వివాహితుల వైవాహిక జీవితం ఆనందమయమవుతుంది. ఈ కాలంలో అవివాహితులు వివాహ ప్రతిపాదనలను వచ్చే అవకాశాలున్నాయి. ఇది వారి జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది పలకవచ్చు. ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తుంటే.. మీ ప్రయత్నాలు నెరవేరుతాయి. మీ ఇంట్లో ఆనందం వెల్లిరిసి ప్రశాంత వాతావరణం ఉంటుంది. అదృష్టం మీ వైపు ఉంటుంది. మీరు సామాజికంగా గౌరవాన్ని పొందుతారు. మీ ఖ్యాతిని పెరుగుతుంది. మొత్తంమీద ఈ సమయం మిథున రాశి వారికి అంతా కలిసి వస్తుంది.
గజకేసరి రాజయోగం కన్యారాశి వారికి మంచి ఫలితాలు ఉండనున్నాయి. ముఖ్యంగా కెరీర్, వ్యాపారం పరంగా చాలా శుభపద్రం. ఈ రాజయోగం మీ కర్మ భావాన్ని ప్రభావితం చేస్తుంది. దాంతో పనిలో విజయం దక్కుతుంది. ఈ సమయం కొత్త ప్రారంభాలకు, ప్రధాన నిర్ణయాలకు కూడా అనుకూలంగా ఉంటుంది. కొత్త వాహనం, ఇల్లును కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. ఇది మీ జీవనశైలిని మెరుగుపరచడంతో పాటు స్థిరీకరిస్తుంది. నిరుద్యోగులకు ఈ సమయంలో మంచి ఉపాధి అవకాశాలు పొందే అవకాశం ఉంది. వ్యాపారంలో ఉన్నవారు కొత్త, మెరుగైన ఆర్డర్లను పొందే అవకాశం ఉంది. ఫలితంగా ఆర్థిక లాభాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ చేయాలని అనుకుంటే ఈ సమయం మీకు కలిసి వస్తుంది. ఆర్థిక స్థిరత్వాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఈ కాలంలో మీ తండ్రితో మీ సంబంధం కూడా స్నేహపూర్వకంగా, బలంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో శాంతి, ఆనందం వెల్లివిరుస్తుంది. ఈ సమయం కన్యారాశివారికి ఎంతో బాగుంటుంది.
Read Also :
Venus Transit | కన్యారాశిలోకి శుక్రుడు.. ఈ రాశులవారి తలరాతనే మార్చబోతున్నాడుగా..!
Mercury Transit | తులారాశిలోకి బుధుడు.. ఈ రాశులవారు పట్టిందల్లా బంగారమే..!
Kendra Yogam | రెండురోజుల్లో కేంద్ర యోగం.. ఇక ఈ మూడురాశుల వారి జాతకమే మారబోతోందిగా..!