Mercury Transit | నవగ్రహాల్లో ఒకటైన బుధుడు తన గమనాన్ని మార్చుకున్నాడు. దసరా పండుగ రోజున కన్యారాశిలో ఉదయించగా.. అక్టోబర్ 3 నుంచి తులారాశిలో ప్రవేశించాడు. ఈ క్రమంలో బుధుడి సంచారం కారణంగా 12రాశులవారిపై ప్రభావం ఉంటుంది. కానీ కొన్ని రాశుల వ్యక్తులు వ్యాపారంలో లాభాలు, కెరీర్లో శుభవార్త, సంబంధాలలో ప్రేమ, పరీక్షల్లో ఆశించిన ఫలితాలను పొందుతారు. ఇంతకీ ఆ అదృష్టరాశులవారెవరో తెలుసుకుందాం..!
ఈ సమయంలో కన్యారాశివారు శుభవార్తలు వింటారు. వ్యక్తిగత సంబంధాలు మరింత బలపడుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా మారుతుంది. వ్యాపారంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. కొత్త వ్యాపారాన్ని కూడా ప్రారంభిస్తారు. ఈ సమయంలో పూర్వీకుల ఆస్తి సంబంధించి ఏదైనా వివాదం ఉంటే పరిష్కారమవుతుంది. దాంతో మీరు ప్రయోజనం పొందే అవకాశం ఉంది. ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే ఛాన్స్ ఉన్నది. యువతకు కెరియర్లో కొత్త మార్గాలు తెరుచుకుంటాయి.
తుల రాశి వారు తమ పెండింగ్ పనులన్నీ పూర్తి చేసుకుంటారు. మీ ఆలోచనలను ఇతరులతో పంచుకొని.. ఈ విషయంలో విజయం పొందుతారు. బుధుడి సంచారం కారణంగా మీ మాటలు అందరినీ ఆకట్టుకుంటాయి. కమ్యూనికేషన్ మీ పనితీరుపై ప్రభావం చూపుతుంది. దాంతో గణనీయమైన ప్రయోజనాలు పొందే అవకాశం గోచరిస్తున్నది. చాలా కాలంగా ఉద్యోగం కోసం చూస్తున్న వారు శుభవార్తలు వింటారు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఆత్మవిశ్వాసం చెక్కుచెదరకుండా ఉంటుంది. అయితే, ఉద్యోగంలో ఉన్నవారికి కార్యాలయంలో గౌరవం, ముఖ్యమైన బాధ్యతలు అందుకునే అవకాశం కనిపిస్తున్నది.
మకర రాశి వారు పెట్టుబడుల ద్వారా మంచి ఫలితాలుంటాయి. ఓ వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీ అభీష్టానుసారం ఉజ్వల భవిష్యత్తుకు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అవివాహితులకు వివాహం జరిగే అవకాశం ఉంది. అయితే, ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. మకర రాశి వారు సకాలంలో తమ లక్ష్యాలను సాధించడం ద్వారా సంతృప్తిగా ఉంటారు. మీ ప్రసంగం ఆకట్టుకుంటుంది. పలువురు కొత్త వ్యక్తులతో మీకు పరిచయం ఏర్పడుతుంది.
Read More :
“Pratiyuti Yogam | శని-శుక్రగ్రహాల సంయోగంతో ప్రతియుతి యోగం..! ఈ మూడురాశుల వారి కష్టాలకు చెక్..!”