Nava Panchama Rajayogam | జ్యోతిషశాస్త్రం ప్రకారం గ్రహాల కదలిక కీలకమైంది. నవగ్రహాల్లో ప్రధాన గ్రహం అంగారక గ్రహం. ఇది శక్తి, ధైర్యం, శౌర్యానికి ప్రతీకగా పేర్కొంటారు. అంగారక గ్రహం ప్రతి 45రోజులకోసారి ఒకరాశి నుంచి మరో రాశిలోకి వెళ్తుంది. ఈ గ్రహసంచారంతో ఓ వ్యక్తి జాతకం మాత్రమే కాకుండా యావత్ ప్రపంచ పరిస్థితులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రస్తుతం అంగారక గ్రహం కన్యారాశిలో ఉంది. ఈ పరిస్థితిలో ఒక వైపు, అది శనితో సమసప్తక యోగాన్ని (180 డిగ్రీల సంబంధం) ఏర్పరుస్తుండగా.. అదే సమయంలో కుంభరాశిలో రాహువుతో కలిసి షడాష్టక యోగాన్ని ఏర్పరుస్తున్నది. ఈ రెండు యోగాలతో పలు రాశులవారికి కొత్త సవాళ్లు ఎదురవుతాయి. అయితే, ఆగస్టు 10న ఉదయం 4.38 గంటలకు నవపంచమ రాజయోగం ఏర్పడనున్నది. ఈ ప్రత్యేక, శుభం యోగం ఏర్పడబోతున్నది. ఈ యోగం జ్యోతిషశాస్త్రంలో చాలా అరుదైనది. శుభప్రదమైందిగా పేర్కొంటారు. దాంతో పలు రాశులవారికి విజయం, గౌరవం, ఆర్థికంగా లాభం చేకూరనున్నది. ఈ నవపంచమ యోగం ఏ రాశులవారి వారికి శుభాలు జరుగనున్నాయో తెలుసుకుందాం..!
రాబోయే కాలంలో వృషభరాశి వారికి అదృష్టంగా పేర్కొంటారు. ఈ సమయంలో శని, బృహస్పతి ఏర్పడే యోగం దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. బృహస్పతి సంపదకు సంబంధించిన ఇంటిలో ఉండడంతో ఆకస్మిక ధనలాభం జరిగే అవకాశాలున్నాయి. దాంతో మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కొత్తగా ఆదాయ వనరులు సమకూరుతాయి. జీవితంలో.. ముఖ్యంగా కెరీర్, వ్యాపారంలో సానుకూల మార్పులను చూస్తారు. కుటుంబ సంబంధాలు మరింత బలపడుతాయి. పాత గొడవలన్నీ సద్దుమణుగుతాయి. మీ మాటలతో అందరినీ ఆకట్టుకుంటారు. సామాజిక, వృత్తిపరమైన రంగాల్లో విజయం సాధిస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు, యువతకు ఈ సమయం శుభపద్రంగా ఉంటుంది. ఏకాగ్రత పెరుగుతుంది. చదువుపై దృష్టిపెడుతారు. పెట్టుబడులు పెట్టేవారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.
మకర రాశి జాతకులకు ఈ యోగం కారణంగా చాలా శుభ ఫలితాలు ఉండనున్నాయి. జీవితంలో పురోగతి, స్థిరత్వంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుంది. చాలాకాలంగా ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులు తమ బిజినెస్‌ను విస్తరిస్తారు. వృత్తికి సంబంధించిన పని కోసం ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. భవిష్యత్‌లో ఎంతో ప్రయోజనం కలిగిస్తుంది. ఆరోగ్యంపరంగా బాగుంటుంది. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. కుటుంబ జీవితం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. పిల్లలకు సంబంధించిన సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. సంబంధాల్లో సానుకూల మార్పులను చూస్తారు.
ఈ సమయం కుంభరాశి వారికి చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది. ఓ రకంగా వీరిని అదృష్టవంతులను చెప్పొచ్చు. గురువు, శనిగ్రహాల కారణంగా ఏర్పడే ఈ యోగం కారణంగా అనేక అవకాశాలు వస్తాయి. శని సాడే సాత్ చివరి దశ స్తబ్ధత తర్వాత మీ జీవితంలో కొత్తదనం వస్తుంది. ఆర్థిక విషయాల్లో విజయం సాధిస్తారు. ఆదాయం పెరుగుతుంది. పెద్దల నుంచి వచ్చిన ఆస్తితో ప్రయోజనం పొందే సూచనలు కనిపిస్తున్నాయి. సంపదను కూడబెట్టేందుకు చేసే ప్రయత్నం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ జీవితంలో ప్రేమ, సహకారం లభిస్తాయి. కుటుంబ జీవితం మధురంగా ఉంటుంది. విదేశీ కంపెనీల్లో పని చేసేవారు, విదేశీ కంపెనీల్లో వ్యక్తులకు కొత్త అవకాశాలు, లాభాలు పొందుతారు. కుంభరాశి వారికి సంపద, గౌరవం, కుటుంబ ఆనందం, వృత్తిలో కొత్త శిఖరాలను చేరుకుంటారు.
Mercury Rising | నేడు కర్కాటకంలో ఉదయించనున్న బుధుడు.. ఈ మూడు రాశులవారికి అన్నీ శుభవార్తలే..!